ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామంలో తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదని సరస్వతి అనే మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేసింది. తన సమస్యకు పరిష్కారం లభిస్తే గాని కిందకు దిగి రానంటూ ఆరు నెలల పిల్లాడిన వదిలి మొండికేసింది..
వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా మానకొండూరు కు చెందిన సరస్వతి అనే మహిళకు చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు కు చెందిన పెసరి నాగరాజు తో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉండగా ఆరు నెలలుగా భర్త నాగరాజు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనతో పాటు పుట్టిన పిల్లలను కూడ పట్టించుకోవడం లేదంటూ సరస్వతి అనే గృహిణి మానకొండూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే సమస్యను పెద్ద మనుషుల సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు అమెకు సర్ధిచెప్పి పంపించారు..దీంతో సరస్వతి తనకు న్యాయం చేయాలంటూ గ్రామంలోని పెద్దమనుషులకు ఫిర్యాదు చేసింది..
అయితే పెద్ద మనుష్యుల వద్ద సమస్య పరిష్కారం కాకపోవడంతో చేసేదిలేక చిన్న ముల్కనూరు లోని అత్తగారి ఇంటికి చేరుకుంది.. గ్రామంలోని నీళ్ల ట్యాంకు ఎక్కి తనకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టింది. విషయం తెలుసుకొని స్థలానికి చేరుకున్న ఎస్సై మధుకర్ సరస్వతి తో ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సరస్వతి ట్యాంక్ నుంచి కిందికి దిగింది. దీంతో గ్రామస్తులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కగా సరస్వతి సంవత్సరంలోపు పిల్లవాడు కూడ ఉండడం గమనార్హం . ఆ పిల్లవాడిని వదిలిపెట్టి వాటర్ ఎక్కి కూర్చుంది..దీంతో గ్రామస్థులు హైరానా పడ్డట్టు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Women