హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రే... మహిళలకు మాత్రమే

హైదరాబాద్ మెట్రో రైల్లో భద్రత కోసం తమతోపాటు పెప్పర్ స్ప్రే తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చింది.

news18-telugu
Updated: December 4, 2019, 8:48 PM IST
హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రే... మహిళలకు మాత్రమే
మెట్రో రైలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించే మహిళలు, యువతులకు సంస్థ యాజమాన్యం ఓ ఆఫర్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్లో భద్రత కోసం తమతోపాటు పెప్పర్ స్ప్రే తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చింది. బెంగళూరు మెట్రోలో ప్రస్తుతం ఈ విధానం అమల్లో ఉంది. అక్కడ భద్రత కోసం మహిళలు, యువతులు తమతోపాటు పెప్పర్ స్ప్రే తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ వద్ద వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో మహిళల భద్రత కోసం హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రే తీసుకుని వెళ్లడానికి అనుమతి కల్పిస్తారా? అంటూ కొందరి నుంచి ప్రశ్నలు వినతులు వచ్చాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మహిళల భద్రత కోసం వారికి కొత్త అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు