WOMEN ON WHEELS IN HYDERABAD WOMEN POLICE FACING PROBLEMS WITH BIKES HEIGHT
'ఉమెన్ ఆన్ వీల్స్'కు కష్టాలు..బైక్స్ నడవలేక లేడీ పోలీసుల తంటాలు
బైక్‌పై ఇబ్బందిపడుతున్న లేడీ కానిస్టేబుల్
పెట్రోలింగ్ కోసం
లేడీ కానిస్టేబుల్స్‌కు హీరో గ్లామర్ బైక్స్ అందించారు. ఐతే వాటి హైట్ ఎక్కువగా ఉండడంతో మహిళా పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. బైక్‌పై ఎక్కినప్పుడు భూమికి కాళ్లు అందక..అటూ ఇటూ తూలుతున్నారు. బ్యాలెన్స్ అదుపుతప్పి..ప్రమాదాలు జరిగే అవకాశముందని భయపడుతున్నారు.
ఉమెన్ ఆన్ వీల్స్..! హైదరాబాద్‌లో మహిళల భద్రతే లక్ష్యంగా తెలంగాణ పోలీస్‌శాఖ తీసుకొచ్చిన మరో గొప్ప కార్యక్రమం..! ఇప్పటికే షీటీమ్స్‌ను రోడ్లపైకి పంపి మహిళలను వేధించే ఆకతాయిల భరతం పడుతున్నారు. మరో ముందడుగు వేసి 'ఉమెన్ ఆన్ వీల్స్'ను తీసుకొచ్చారు పోలీసులు. పెట్రోలింగ్ వ్యవస్థలో మహిళా పోలీసులను భాగస్వామ్యులను చేసి ఆడవారికి కొండంత భరోసా ఇస్తున్నారు. బైక్స్‌పై హైదరాబాద్ నగరంలో పెట్రోలింగ్ నిర్వహించడం వీరి డ్యూటీ.
ఐతే మంచి ఉద్దేశంతోనే చేపట్టిన ఈ కార్యక్రమానికి ఆదిలోనే అవాంతరాలు మొదలయ్యాయి. పెట్రోలింగ్ కోసం
లేడీ కానిస్టేబుల్స్‌కు హీరో గ్లామర్ బైక్స్ అందించారు. వాటి హైట్ ఎక్కువగా ఉండడంతో మహిళా పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. బైక్‌పై ఎక్కినప్పుడు భూమికి కాళ్లు అందక..అటూ ఇటూ తూలుతున్నారు. బ్యాలెన్స్ అదుపుతప్పి..ప్రమాదాలు జరిగే అవకాశముందని భయపడుతున్నారు. ఈ క్రమంలో తక్కువ హైట్ ఉండే బైకులు గానీ...లేదంటే స్కూటీలు ఇవ్వాలని కోరుతున్నారు.
మాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. ఆడవాళ్లు ఎక్కువగా యాక్టివా నడుపుతారు. మాకు బైక్స్ నడపడం అంతగా అలావాటు లేదు. బైక్స్‌పై పెట్రోలింగ్ వెళ్లడం కొంచెం కష్టంగా ఉంది. స్కూటీలిస్తే బాగుటుంది.
— అన్నపూర్ణ, మహిళా కానిస్టేబుల్
బైక్స్ నడపడంలో మహిళా పోలీసులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇది ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. మహిళా పోలీసుల నుంచి అభిప్రాయాలను తీసుకొని మార్పులు చేస్తాం.
— కేఎస్ రావ్, ఏసీపీ , బంజారాహిల్స్
హైదరాబాద్‌లో మొత్తం 46 మంది మహిళా కానిస్టేబుల్స్‌కు పెట్రోలింగ్ శిక్షణ ఇచ్చారు. డ్రైవింగ్‌తో పాటు పలు అంశాల్లో రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి ప్రజల్లోకి పంపిస్తారు. ప్రతి ఏసీపీ డివిజన్‌లోనూ ఒక లేడీ పెట్రోలింగ్ టీమ్ ఉంటుంది. ఒక టీమ్‌లో ఇద్దరు చొప్పున ఉంటారు. వారిద్దరు బైక్‌పై వెళ్లి జనావాసా ప్రాంతాల్లో రోడ్లపై కలియ తిరగాల్సి ఉంటుంది. ఉమెన్ పెట్రోలింగ్ సిబ్బందితో మహిళలు..తమ సమస్యలను నేరుగా చెప్పుకునేందుకు వీలుంటుంది. ఐతే మహిళా పోలీసుల ఎత్తు, దేహ దారుఢ్యాన్ని దృష్టిలో ఉంచుకొని..వారికి సరిపోయే బైక్స్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.