హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: బతుకమ్మ పండుగలో కోలాట ప్రదర్శనలు .. ఆ గ్రామ మహిళలే అందులో అద్భుత కళాకారులు

Telangana: బతుకమ్మ పండుగలో కోలాట ప్రదర్శనలు .. ఆ గ్రామ మహిళలే అందులో అద్భుత కళాకారులు

Mahbubnagar Dance troupe

Mahbubnagar Dance troupe

Telangana: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాణం పోస్తున్న అనేక కళారూపాలకు పల్లెల్లో ప్రాణం పోసుకుంటున్నాయి. కాని అంతరిస్తున్న గ్రామీణ కళలకు జీవం పోస్తూ ముందు తరాలకు పల్లె ఆట ,పాటలను పరిచయం చేసేలా కృషి చేస్తున్నారు శ్రీభ్రమరంభ కళాబృందం సభ్యులు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (Syed Rafi, News18,Mahabubnagar)

  సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాణం పోస్తున్న అనేక కళారూపాలకు పల్లెల్లో ప్రాణం పోసుకుంటున్నాయి. కాని అంతరిస్తున్న గ్రామీణ కళలకు జీవం పోస్తూ ముందు తరాలకు పల్లె ఆట ,పాటలను పరిచయం చేసేలా కృషి చేస్తున్నారు శ్రీభ్రమరంభ కళాబృందం (Sri Bhramarambha Art Group)సభ్యులు. మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా సమీపంలోని భూత్పూర్( Bhutpur)మండల పరిధిలో గోప్లాపూర్ (Goplapur)గ్రామానికి చెందిన మహిళలు ఐదు, ఆరేళ్లుగా బతుకమ్మ కోలాటం ప్రదర్శనలు ఇస్తూ అందరిని అలరిస్తున్నారు. అధికారులు, కళాభిమానుల ప్రశంసలు అందుకుంటున్న గోప్లాపూర్‌ గ్రామ మహిళల నృత్యబృందం ప్రత్యేకతను అందరికి చాటి చెప్పే ప్రయత్నం న్యూస్‌ 18 (News18)చేస్తోంది.

  Bathukamma 2022: తెలంగాణలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు .. ఆడపడుచులకు అమిత్‌షా శుభాకాంక్షలు

  ఒక్కరుగా మొదలై అందరూ ఏకమై..

  మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం గోప్లాపూర్ గ్రామంలో ఒక్కరి ఆలోచనతో మొదలైన కోలాట ప్రదర్శన అనతి కాలంలోనే అందరిని భాగ్యస్వాములను చేసింది. భజన మండలి కళాకారుడు పట్నం రాములు ప్రోత్సాహంతో మహిళలు కోలాటంపై ఆసక్తి పెంచుకున్నారు. నృత్య శిక్షకులు రాము సమక్షంలో 6 నెలల పాటు శిక్షణ పొందారు. పగలంతా వ్యవసాయం కూలి పనులు చేస్తూ సాయంత్రం తీరిక సమయంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు శిక్షణ పొందారు. భూత్పూర్ మండలం చుట్టూ పక్కల గ్రామాలతో పాటు ప్రముఖ దేవస్థానాలైన కురుమూర్తి, మన్యంకొండ బ్రహ్మోత్సవాల కళా ప్రదర్శనలు భాగస్వాములు అయ్యారు.

  బతుకమ్మతో మెరుగైన అవకాశాలు..

  ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు, జడ్చర్ల, కొడంగల్, నాగర్ కర్నూల్ , వనపర్తి పక్కనే ఉన్న నల్గొండ జిల్లాలోని భువనగిరి, సంగారెడ్డి జిల్లాలోను కోలాటం బతుకమ్మ ప్రదర్శనలు చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ప్రభుత్వ సలహాదారులు కే.వి.రామణాచారి చేతులమీదుగా పురస్కారం కూడా అందుకున్నారు.బతుకమ్మ కోలాటం మన సంస్కృతిలో ఒక భాగం తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ విశేష ఆదరణ పొంది పూర్వవైభవాన్ని సంతరించుకుందంటున్నారు గోప్లాపూర్ మహిళ కవిత. సంస్కృతిని కాపాడుకునేలా ఈతరహా కళను ప్రదర్శిస్తున్నామంటున్నారు.

  Telangana : పేద, ప్రతిభావంతులైన విద్యార్ధులకు సాయం .. పూర్వ విద్యార్ధులు చేస్తున్న గొప్ప పనేంటో తెలుసా..?

  గ్రామ పెద్దల ప్రోత్సాహంతోనే ..

  పెద్దల సహకారంతో శిక్షణ తీసుకొని అద్భుతంగా ప్రదర్శనలు ఇవ్వడంతో కొద్ది రోజుల్లోనే ప్రజా ప్రతినిధులు ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి.ఊళ్లో వాళ్ళందరినీ ఒక్క తాటికి పైకి తీసుకొచ్చేందుకు ఈ కళలు దోహద పడ్డాయన్నారు మరో కళాకారిణి రమాదేవి. గతంలో పండుగలు ఉత్సాహాలు ఏది జరిగిన ఎవ్వరికి వారే నిర్వహించుకునేవారు కానీ కళాబృందం ఏర్పడిన తర్వాత గ్రామంలో ఏ చిన్న ఉత్సాహం జరిగిన మహిళలందరం భాగ్యస్వామ్యులం అవుతున్నారని.. చిన్నారులతో సహా అందరూ కలిసి ఆడిపాడుతున్నారని గ్రామస్తురాలు వెంకటేశ్వరమ్మ తెలిపారు. కళాబృందంలో సభ్యురాలిగా చేరి అందరితో పాటు కళా ప్రదర్శన చేస్తుండడం వల్ల ప్రత్యేక గుర్తింపు వచ్చింది డిగ్రీ వరకు చదివాను టైలరింగ్ చేస్తూనే బతుకమ్మ కోలాటంపై నాకున్న ఆసక్తిని చాటుతున్నట్లుగా తెలిపారు. ప్రదర్శనలతో వచ్చిన డబ్బులతో అలంకరణ సామాగ్రిని సమకూర్చుకుంటూ సంతృప్తిని పొందుతున్నట్లుగా తెలిపారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Mahbubnagar, Telangana News

  ఉత్తమ కథలు