Home /News /telangana /

WOMEN MAKING ECONOMIC PROGRESS BY MAKING FOOD PRODUCTS IN PEDDAPALLI DISTRICT SNR PSE NJ

Peddapalli : ఆడాళ్లా మజాకా..వాళ్లు తలుచుకుంటే సాధించలేనిది ఏమైనా ఉందా

(స్త్రీ శక్తి)

(స్త్రీ శక్తి)

Women Power:మీ వల్ల ఏమవుతుందని దెప్పిపొడుపు మాటలు, వ్యాపారం చేస్తానంటే అది నీకు చేతకాదని వెనక్కి లాగే ప్రయత్నాలను దాటుకొని ముందుకెళ్లారు. మహిళా లోకం తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదని నిరూపించారు పెద్దపల్లి జిల్లాకు చెందిన కొందరు ఆడపడుచులు సాధించిన విజయం చూస్తే ఔరా అనాల్సిందే.

ఇంకా చదవండి ...
  (E.Santosh,News18,Peddapalli)
  ఇంటా, బయట, వ్యక్తిగతంగా, వృత్తి పరంగా మహిళలు ఎన్నో విజయాలు సాధిస్తున్నా స్వేచ సంకెళ్ళు వారిని వెనక్కి లాగుతూనే ఉంటాయి. వారి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. కానీ ఒక్క అవకాశం ఆ స్త్రీ మూర్తులను సిరిగల మహాలక్ష్ములుగా మార్చింది. చిరుధాన్యాల ఉత్పత్తులతో అనతికాలంలోనే ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. పెద్దపల్లి(Peddapalli) జిల్లాలోని రామగిరి ఖిల్లా(Ramagiri)ను అడ్డాగా చేసుకొని స్త్రీ శక్తిని చాటుతున్నారు. రామగిరి మండలం నాగారం(Nagaram) గ్రామానికి చెందిన మహిళలు ఇప్పుడు ఎందరో ఆడబిడ్డలకు ఆదర్శంగా నిలిచారు. చిరుధాన్యాలతో బిస్కెట్లు(Biscuits), కేకులు(Cakes),రాగి మాల్ట్‌తో పాటు పోషకాహర ఉత్పత్తులు తయారు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. రామగిరి ఖిల్లాలో 2010 నుంచి కృషి విజ్ఞాన కేంద్రం పనిచేస్తున్నది. ఈ కేంద్రం ఆధ్వర్యంలో నాగారంలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిరుధాన్యాలతో పలురకాల ఉత్పత్తులు తయారు చేసేలా అక్కడి మహిళలను ప్రోత్సహించారు. వనితా జ్యోతి గ్రామైక్య సమాఖ్య(Vanitha Jyothi Rural Federation) పేరుతో కొంతమంది మహిళలను ఓ గ్రూపుగా చేర్చి పదిరోజులపాటు శిక్షణ అందించారు. తర్వాత రూ.1.50 లక్షలతో ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామగ్రిని, యంత్రాలను అందజేశారు.

  స్త్రీ శక్తికి నిదర్శనం..
  కృషి విజ్ఞాన కేంద్రం అండతో చిరుధాన్యాల ఉత్పత్తులు తయారుచేయడం మొదలు పెట్టారు నాగారం వనితలు. వారి ఉత్పత్తులకు మార్కెట్లో మంచి పేరు రావడంతో కొత్తగా ‘సిరి ఫుడ్ ప్రొడక్ట్స్’ పేరుతో వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్లు తయారుచేస్తున్న మిల్లెట్ బిస్కెట్లు(millet biscuits),కేకులు(cakes),దిల్పసంద్ బ్రెడ్, రాగి మాల్ట్(ragi malt),మల్టీ గ్రెయిన్ పిండి(multi-grain)ని…. పెద్దపల్లి, మంథని, గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్లు… వేములవాడ, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. అంతేకాదు సింగరేణి, రామగుండం, ఎన్టీపీసీ ప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు.

  ఆడాళ్లు మీకు వందనాలు..
  మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాలతో రుచికరమైన ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నామంటున్నారు మహిళలు. మొత్తం 18 మంది సభ్యులు కలిగిన ఈ సమాఖ్యలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందుతున్నారు. రోజూ 40 కిలోల బిస్కెట్లు ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, సోయా లాంటి చిరుధాన్యాలతో రకరకాల ఉత్పత్తులు తయారుచేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

  (స్రీశక్తి)
  (స్రీశక్తి)


  బిజినెస్‌ విమెన్స్..
  ఆడవాళ్లు అనితరసాధ్యులనే నానుడిని నిజం చేశారు పెద్దపల్లి జిల్లాకు చెందిన మహిళలు. నాగారంలో మహిళల చైతన్యాన్ని స్వయంగా చూసిన కలెక్టర్ సంగీత సత్యనారాయణ బేకరీ ఉత్పత్తులను మరింత రుచికరంగా, ఆకర్షణీయంగా తయారు చేసేందుకు రూ.80 వేలు సాయం అందించారు. ఈ మొత్తంతో ముడి సరుకులను కొనుగోలు చేసి, ఉత్పత్తి పెంచారు. తమపై నమ్మకం ఉంచి, ప్రోత్సహించిన కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులకు, అధికారులకు రుణపడి ఉంటామని వనితా జ్యోతి గ్రామైక్య సమాఖ్య అధ్యక్షురాలు బూడిద రజిత, సభ్యులు చెబుతున్నారు. తమ విజయం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తినిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: PEDDAPALLI DISTRICT, Womens association

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు