Home /News /telangana /

WOMEN CELEBRATING HENNA FESTIVAL IN ADILABAD DISTRICT SNR ADB

Adilabad : ఆషాడమాసంలో ఆ పండుగ ఆడవాళ్లకు మాత్రమే .. ఆదిలాబాద్‌లో వేడుకగా జరుపుకున్న ఆడపడుచులు

(గోరింటాకు పండుగ)

(గోరింటాకు పండుగ)

ADILABAD: వేడుకలు, పండుగలు, శుభకార్యాలకు మహిళల చేతులు గోరింటాకు అలంకారంతో మిలమిల మెరిసిపోతూ ఉంటాయి. ఆషాడమాసం ఆరంభంతోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మహిళామణులు గోరింటాకు పండుగను ఎంతో ఆడంబరంగా జరుపుకున్నారు.

  (K.Lenin,News18,Adilabad)
  వేడుకలు, పండుగలు, శుభకార్యాలకు మహిళల చేతులు గోరింటాకు అలంకారంతో మిలమిల మెరిసిపోతూ ఉంటాయి. కాని ఏ ప్రాంతంలోనైనా కొంత మంది మహిళలు గ్రూప్‌గా చేరి ఒకరి చేతులకు మరొకరు గోరింటాకు పెట్టుకోవడం ఎక్కువగా ఆషాడమాసంలో జరుగుతూ ఉంటుంది. అయితే ఆషాడమాసం ఆరంభంతోనే ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad)జిల్లాలోని మహిళామణులు గోరింటాకు సందడి(Henna festival)తో పండుగ శోభను సంతరించుకుంటున్నాయి. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సనాతన ఆచారాలు, ఈ తరహా సాంప్రదాయాలను మహిళలు కొనసాగిస్తున్నారు.

  గోరింటాకు పండుగ..
  ఆషాడ మాసంలో ప్రతి మహిళ గోరింటాకును పెట్టుకోవాలన్న ఆనవాయితీని కొనసాగిస్తూ సంబురాలు జరుపుకొంటున్నారు. ఏ ఇంట చూసిన అతివల అరచేతులు గోరింటాకుతో మెరిసిపోతున్నాయి. ఏ ఇంట్లో చూసిన గోరింటాకు సందడి కనిపిస్తోంది. ఇలా ఆషాడమాసంలో చేతులకు గోరింటాకు పెట్టుకుంటే శారీరానికి కూడా ఎంతో మంచిదని చెబుతారు. గోరింటాకుకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. గ్రీష్మ రుతువు ముగిసి వర్ష రుతువు ప్రారంభమవుతుంది. అయితే గ్రీష్మంలో శరీరంలో వేడి ఎక్కువగా ఉండి బయట వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గి జ్వరాలు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గోరింటాకుకు ఉన్న ప్రత్యేక గుణం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు అరచేతులకు, పాదాలకు పెట్టుకుంటారు.ఆషాడమాసంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు.  ఆషాడమాసం సాంప్రదాయం..
  సహజంగా పెరిగే గోరింటాకు చెట్ల నుండి ఆకులను తెంపుకొని వచ్చి, వాటిని రోట్లో వేసి మెత్తగా నూరి మహిళలు చేతులకు పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంతోపాటు సౌభాగ్యం వస్తుందని నమ్మకం. ఈ క్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో శారదా మహిళా మండలి ఆధ్వర్యంలో గోరింటాకు పండుగను సంబరంగా జరుపుకున్నారు. మహిళలంతా నూతన వస్త్రాలు ధరించి సామూహికంగా గోరింటాకులను సొంతగా దంచి పేస్టులా మార్చి అరచేతులు..కాళ్లకు అలంకరించుకున్నారు. ఒకరికొకరు గోరింటాకును అలంకరించుకుంటూ ఆటపాటలతో సందడి చేశారు.

  Peddapalli: తెలంగాణలో నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్: NTPC అద్భుత ఆవిష్కరణ  ఆరోగ్యానికి మేలు చేసే గోరింటాకు..
  ఆషాడ మాసంలో జరుపుకొనే ఈ గోరింటాకు పండుగకు పురాణ ప్రాశస్త్యంతో పాటు సైన్సు పరంగానూ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు మహిళా మండలి అధ్యక్షురాలు దుర్గా భవాని. వర్షాకాలం ఆరంభంలో వచ్చే తొలకరి వర్షాలతో వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయని .. చల్లటి వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో గోరింటాకు ఎంతో ఉపకరిస్తుంది తెలిపారు. అలాగే రోజంతా నీటితో పనిచేసే గృహిణులకు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులతో చర్మ వ్యాధులు సోకె అవకాశం ఉందని వీటి నుంచి సైతం గోరింటాకు రక్షణ కల్పిస్తుందన్నారు. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలున్న గోరింటాకును సామూహిక ఉత్సవంగా జరుపుకోవడంతో ఎప్పుడూ ఇంటి పనులతో నిమగ్నమయ్యే ఆడపడుచులకు ఆటవిడుపుగాను ఉంటుందని పేర్కొన్నారు.

  Traffic violations: షాకింగ్​.. హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్లపైకి వచ్చిన 15 లక్షల మంది.. అందరిపై కేసులు..  అలంకారంగా గోరింటాకు..
  గోరింటాకు అంటే కేవలం మహిళల అలంకరణకు మాత్రమేనని ఎక్కువ మందికి తెలుసు. దీనిలో అద్భుతమైన ఔషధ శక్తులు కూడా ఉన్నాయని, వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యుడు జక్కుల నరేందర్ పేర్కొన్నారు. కీళ్ల నొప్పి, కీళ్ల వాపు, కాళ్ల పగుళ్లకు కూడా ఔషధంగా పనిచేస్తుందని తెలిపారు. ఏదిఏమైనప్పటికి పెళ్ళిళ్ల సమయంలో మెహింది వేడుకలను ఒక వేడుకగా ఎంతో ఆడంభరంగా జరుపుకుంటున్న ఈ రోజుల్లో కూడా పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఇల ఆషాడంలో గోరింటాకు సంబురాలు జరుపుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.

  Weather alert: హైద‌రాబాద్​కు రెడ్ అల‌ర్ట్​.. మరో 3 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు.. తెలంగాణ‌లోని ఆ తొమ్మిది జిల్లాల్లో కూడా..


  Published by:Siva Nanduri
  First published:

  Tags: Adilabad, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు