నకిలీ దృవ పత్రాలతో విదేశాలకు వెళ్లడం, ఆ తర్వాత అక్కడ అనేక కష్టాలు పడడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలవాటుగా మారింది.. ప్రభుత్వ అధికారులు నిఘా పెంచినా .. ఏజెట్లు తమకున్న పరిచయాలతో అనేకమందిని విదేశాలకు పంపిస్తు.. వారి జీవితాల్లో చీకట్లు నింపుతున్న పరిస్థతి కనిపిస్తోంది. ( women arrested at shamshabad ) ఇలా విదేశాలకు డబ్బు సంపాదనకు వెళ్లిన వారిలో కొంతమంది అడ్రస్ కూడా లేక ఆయా కుటుంబాలు విలవిలలాడుతున్నాయి.
అయినా ఈ దందా మాత్రం అగడం లేదు.. కరోనా పరిస్థితులు మెరుగు పడడంతో చాలా మంది అరబ్ దేశాలకు వెళుతున్నారు. దీంతో మరోసారి అక్రమ దందాకు తెరలేసింది. ఫేక్ సర్టిఫికెట్స్తో ఏకంగా 44 మందిని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు.
Teenmar mallanna : కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావులను కట్టేసి, ఆ కుటుంబాలతో కొట్టిస్తా...!
స్థానిక పోలీసులు తెలిపిన ప్రకారం... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ( women arrested at shamshabad ) వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న కొంత మంది దళారులు డబ్బులు తీసుకొని నకిలీ వీసాలు, ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు. వీరందరికీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి టికెట్లు బుక్ చేశారు. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మహిళల వీసాలు, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులు అవన్నీ నకిలీవని తేల్చారు. ( women arrested at shamshabad ) పట్టుబడ్డ మహిళలను ఇమిగ్రేషన్ అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం మహిళలను ఆర్జీఐఏ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
KCR: కేసీఆర్ మౌనం.. ఆ సీనియర్ నేత పొలిటికల్ కెరీర్ మళ్లీ డైలమాలో పడిపోయినట్టేనా ?
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Shamshabad Airport