ఇద్దరు విదేశీ మహిళలు..అనుమానం రాకుండా వ్యవహరించారు.... సాధారణ మహిళలుగా ప్రయాణం చేస్తూ కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డారు.
ఉగాండా, జాంబియాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణీకుల నుంచి రూ.78 కోట్లు విలువైన 12 కిలోలు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు మహిళ ప్రయాణీకులను అరెస్టు చేసినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.
ఉగాండాకు చెందిన మహిళ గతంలో మిస్ అయిన తన సామానును తీసుకోడానికి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అయితే ఆమె కొన్ని రోజుల కిందటే బింబాబ్వే, జోహాన్నెస్‌బర్గ్, దోహ్‌ల మీదుగా హైదరాబాద్‌కు వచ్చినట్లు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. అయితే ఆ మహిళలు ఇద్దరు స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో ... వెంట తెచ్చిన తన లగేజిని డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేశారు. దీంతో పొడి రూపంలో ఉన్న హెరాయిన్ తెచ్చినట్లు గుర్తించారు. దీంతో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
జాంబియా నుంచి జోహాన్నెస్‌బర్గ్, దోహల మీదుగా శంషాబాద్‌కు వచ్చిన మరో మహిళను కూడా డీఆర్‌ఐ అధికారులు అనుమానంతో ఆ మహిళ లగేజిని కూడా క్షుణ్నంగా తనిఖీ చేశారు. అందులో పైప్ రోల్స్‌ను గుర్తించారు. అనుమానం వచ్చి దానిని పూర్తిగా తీయగా మధ్యలో పొడి రూపంలో హెరాయిన్ దాచినట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. వెంటనే ఆ మత్తుమందులను స్వాధీనం చేసుకుని ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Shamshabad Airport, Smuggling