హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool : కూతురు పెళ్లి .. ఆ మరుక్షణమే తల్లి చావు ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే..

Nagar Kurnool : కూతురు పెళ్లి .. ఆ మరుక్షణమే తల్లి చావు ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే..

(డ్యాన్స్ చేస్తూనే..)

(డ్యాన్స్ చేస్తూనే..)

Nagar Kurnool: వివాహ వేడుక కాస్తా ..విషాదంగా మారింది. బిడ్డకు పెళ్లి చేసి మెట్టినింటికి సాగనంపే క్రమంలో ఆ తల్లి ఆనందంగా డ్యాన్స్ చేసింది. ఊరేగింపులో డ్యాన్స్‌ చేస్తూనే కుప్పకూలిపోయింది పెళ్లి కూతురు తల్లి. అప్పటి వరకు ఆనందోత్సాహంలో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

ఇంకా చదవండి ...

(Syed Rafi, News18,Mahabubnagar)

వివాహ వేడుకల్లో విషాదం నెలకొంది. కన్నకూతుర్ని ఓ ఇంటి దాన్ని చేసిన సంతోషం ఆ కుటుంబ సభ్యుల్లో ఎక్కువ ఉండలేదు. ముగ్గురు సంతానంలో మొదటి బిడ్డ వివాహం జరిగిన సమయంలోనే తల్లి చనిపోవడంతో ఘనంగా పెళ్లి చేసుకున్న కూతురుతో పాటు మిగిలిన ఇద్దరు బిడ్డలతో పాటు కుటుంబ సభ్యులు బోరున విలపించిన ఘటన నాగర్‌కర్నూలు(Nagarkurnool)జిల్లాలో జరిగింది. లింగాల(Lingala)మండలంలోని పద్మన్నపల్లి(Padmannapalli)గ్రామానికి చెందిన మూడవత్‌ విజయలక్ష్మి(Mudhavath Vijayalakshmi)35సంవత్సరాలు కలిగిన మహిళ..కుమార్తె వివాహ వేడుకల్లో భాగంగా కూతుర్ని అత్తగారింటికి సాగనంపే కార్యక్రమంలో భాగంగా బారాత్‌లో డ్యాన్స్‌(Dance‌)చేస్తుండగానే ప్రాణాలు వదిలింది. అందరూ పెళ్లి సంబురాల్లో ఆనందంగా ఉండి డ్యాన్స్‌లు చేస్తున్న సమయంలో పెళ్లి కూతురు(Bride)తల్లి డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిపోవడంతో వెంటనే ఆసుపత్రి(Hospital)కి తరలించారు.

పెళ్లి వేడుకలో చావు డప్పు..

విజయలక్ష్మిని కుటుంబ సభ్యులు హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు ఆమెను చూసి అప్పటికే మృతి చెందినట్లుగా తేల్చి చెప్పారు. మృతురాలు విజయలక్ష్మి గుండెపోటుతో చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. లింగాల మండలంలోని పద్మన్నపల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మికి నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మృతురాలి పెద్ద కుమార్తెను ఎంసీ తాండా గ్రామానికి చెందిన యువకునికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. బిడ్డను మెట్టినింటికి సాగనంపుతుండగా పెళ్లి కూతురు తల్లి ప్రాణాలు వదలడం వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్ని ఎంతగానో కలచివేసింది.

విషాదంగా మారిన వేడుక..

శుక్రవారం రాత్రి పద్మన్నపల్లిలో జరిగిన ఈ సంఘటనను గుర్తు చేసుకొని గ్రామస్తులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురు పెళ్లి ఘనంగా నిర్వహించాలనికుంది విజయలక్ష్మి. సంప్రదాయప్రకారం పెళ్లి చేసిన..కూతుర్ని మేళ, తాళాల మధ్య డ్యాన్సులు, పాటలతో ఊరేగింపుగా సాగనంపాలనుకుంది మృతురాలు విజయలక్ష్మి కాని..ఊరేగింపు మధ్యలోనే ఇంతటి విషాదం జరుగుతుందని పెళ్లి జరిగిన ఇంట్లో గంటలు గడవక ముందే చావు డబ్బు మోగడంతో గ్రామస్తులు సైతం తమ ఆవేదనను మృతురాలి కుటుంబ సభ్యులతో పంచుకున్నారు.

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..

మృతురాలు విజయలక్ష్మికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని..కేవలం వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తున్న సమయంలోనే గుండెపోటుకు గురైందని బంధు, మిత్రులు తెలిపారు. అందరిని ఆప్యాయంగా పలకరించేందని అంటున్నారు. ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల్లో పెద్దకూతురు మెట్టినింటికి వెళ్తిపోగా..ఇంట్లో ఆడదిక్కుగా ఉన్న విజయలక్ష్మి మృతి చెందడంతో మిగిలిన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు విజయలక్ష్మి తమ నుంచి శాశ్వతంగా దూరమైందన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

First published:

Tags: Nagar kurnool, Wedding, Women died

ఉత్తమ కథలు