Hospital Negligence : వైద్యులు లేక ఆసుపత్రి బయటే ప్రసవించిన మహిళ ...!

: వైద్యులు లేక ఆసుపత్రి బయటే ప్రసవించిన మహిళ ...!(ప్రతీకాత్మక చిత్రం )

Hospital Negligence : ఆసుపత్రికి తాళం వేయడంతో ప్రసూతి కోసం వచ్చిన ఓ మహిళ , ఆసుపత్రి బయటే ప్రసవించిన దీన స్థితి తెలంగాణలో నెలకొంది..దీంతో ప్రభుత్వ వైద్యుల తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Share this:
ఓవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ కోసం పాటుపడుతున్నామంటూ ప్రకటనలు చేస్తూంటే మరోవైపు ఆసుపత్రుల సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు..ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాల్సిన ఆసుపత్రులు తమకు ఇచ్చం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నాయి...దీంతో సామాన్య మానవులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. చివరకు గర్భిణిలు కూడా ఆసుపత్రుల సౌకర్యం ఉన్నా అందుబాటులో వైద్యులు లేక ఆరుబయటే ప్రసవం అవుతున్న సంఘటనలు రాష్ట్రంలో కోకొల్లుగా జరుగుతున్నాయి..అసలే కరోనాతో బయపడుతున్న మహిళలు వైద్యుల నిర్లక్ష్యంతో మరింత ఆందోళణకు గురవుతున్నారు.

మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ భేటి అయి మాతా శిశు సంరక్షణపై పెద్ద ఎత్తున చర్చించింది..గర్భిణిలకుమెరుగైన వైద్యం అందించేందుకు పలు జిల్లాల్లో ప్రత్యేక ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించిన కొద్ది గంటలకే ఓ మహిళ వైద్యులు లేక ఆసుపత్రి బయటే ప్రసవం అయింది.. ప్రసవం అయిన అనంతరం మరో ఆసుపత్రికి తరలించిన పరిస్థితి సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్ మండలం బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు మీర్జాపూర్ ఆసుపత్రికి నిండు గర్భిని పురిటి నొప్పులతో చేరుకుంది.. అయితే అప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రి తలుపులు తెరవలేదు. దీంతో నొప్పులు తీవ్రం కావడంతో ఆసుపత్రి బయటే బంధువులు ఆమెకు ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం అక్కడ వైద్యులు లేకపోవడంతో కుటుంబసభ్యులు అంబులెన్సులో తల్లి, శిశువును జహీరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని బంధువులు వెల్లడించారు.

అయితే.. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులు 24గంటల పాటు అందుబాటులో ఉండాలని నిబంధనలు చెబుతాయి. కాని అత్యవసర సేవలు అందించాల్సిన ఆసుపత్రులకు తాళాలు వేయడం లాంటీ సంఘటనలు గర్భినిలకు కష్టంగా మారుతోంది..ఇప్పటికే కరోనాతో బిక్కుబిక్కుమంటూ జీవనం వెల్లదీస్తున్న గర్భినిలు అనేకమంది వైద్య సదుపాయం లేక చివరకు అంబులెన్స్‌లలో ప్రసవం జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి..ఇక వైద్యులు సైతం తమ ఆసుపత్రుల్లో గర్భిణిలను చేర్చుకుని సరైన కాలంలో చికిత్స ఇవ్వకపోవడంతో ఇటివల ఇద్దరు తల్లులు తమ కడుపు కోతకు గురయిన పరిస్థితి తెలంగాణ జిల్లాల్లో నెలకొంది. మరి ఇలాంటీ పరిస్థితిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందను పలువురు సూచిస్తున్నారు.
Published by:yveerash yveerash
First published: