నడిరోడ్డుపై మహిళ మృతదేహంతో ధర్నా.. ఎస్సైను తరిమికొట్టిన బంధువులు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

నడిరోడ్డుపై ధర్నా చేస్తున్న బంధువులు

బంధువులు వినలేదు. ఈ క్రమంలోనే ఆ ఎస్సై కూడా అత్యుత్సాహాన్ని చూపించారు. దీంతో వారికి కోపం తన్నుకొచ్చింది. అసలే బాధలో ఉంటే ఆ ఎస్సై ప్రవర్తన వారికి మరింత చిర్రెక్కింతించింది. దీంతో ఆ ఎస్సైను కొట్టేందుకు..

 • Share this:
  నడిరోడ్డుపై మహిళ మృతదేహాన్ని పెట్టి కొందరు కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్నారు. న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో ఈ విషయం తెలిసి స్థానిక ఎస్సై ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నడిరోడ్డుపై మృతదేహాన్ని తీసేయాలని, దర్యాప్తు చేస్తామని ఆ బంధువులకు చెప్పారు. బంధువులు వినలేదు. ఈ క్రమంలోనే ఆ ఎస్సై కూడా అత్యుత్సాహాన్ని చూపించారు. దీంతో వారికి కోపం తన్నుకొచ్చింది. అసలే బాధలో ఉంటే ఆ ఎస్సై ప్రవర్తన వారికి మరింత చిర్రెక్కింతించింది. దీంతో ఆ ఎస్సైను కొట్టేందుకు వారంతా ముందుకొచ్చారు. వారిని చూసి భయపడిపోయిన ఆ ఎస్సై పోలీస్ స్టేషన్ వరకు పరుగులు తీశారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ముదిగొండలో కందుల భవాని అనే 25 ఏళ్ల మహిళ అనుమానాస్పద రీతిలో మరణిచింది. ఆమె భర్త అశోకే ఈ హత్య చేసి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారిపై భవాని మృతదేహంతో సహా ఆ బంధువులు ఆందోళన చేపట్టారు. న్యాయం కావాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయం తెలిసి ముదిగొండ ఎస్సై మౌలానా ఆ ప్రాంతానికి వెళ్లారు. బాధితులతో చర్చించారు.


  ఇది కూడా చదవండి: నా డబ్బు.. నా ఇష్టమంటూ.. 60 ఏళ్ల వృద్ధ డాక్టర్ నిర్వాకం.. అమ్మాయిలతో చాటింగ్ కోసం రూ.70 లక్షలు..!

  బాధితులతో చర్చలు జరిపే క్రమంలోనే ఆ ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించారు. అసలే బాధలో ఉన్న ఆ బంధువులు కాస్తా, ఎస్సై ప్రవర్తనతో ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఎస్సైపై దాడి చేసేందుకు స్థానికులు, బంధువులు ప్రయత్నించారు. దీన్ని గ్రహించిన ఆ ఎస్సై వారి నుంచి తప్పించుకునేందుకు యత్నించారు. ముదిగొండ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఎస్ఐ మౌలానా పరుగులు తీశారు. ఆయనపై దాడి చేసేందుకు స్థానికులు బంధువులు వెంబడించారు. విషయం తెలిసి సీఐ సత్యనారాయణ రంగంలోకి దిగారు. బంధువులతో మాట్లాడారు. న్యాయంచేస్తామని హామీ ఇవ్వడంతో భవాని బంధువులు ఆందోళన విరమించారు. పోస్ట్ మార్టం నిమిత్తం భవాని బంధువులు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
  ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..
  Published by:Hasaan Kandula
  First published: