హోమ్ /వార్తలు /తెలంగాణ /

khammam : రహస్య పెళ్లి.. భార్యను కడతేర్చింది.. భర్త ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.. !

khammam : రహస్య పెళ్లి.. భార్యను కడతేర్చింది.. భర్త ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.. !

khammam : రహస్య పెళ్లి.. భార్యను కడతేర్చింది..

khammam : రహస్య పెళ్లి.. భార్యను కడతేర్చింది..

khammam : ప్రేమ పెళ్లిలో విషాదం నెలకొంది. సంబంధాలు తెలియక ఒక్కటైన ఇద్దరు .. ఆ తర్వాత అసలు నిజం తెలియడంతో యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు..

ఇంకా చదవండి ...

  అతను ఆమెను ప్రేమించాడు. తన సోదరి క్లాస్‌మేట్‌ కావడంతో ఈజీగానే ఆమె కాంటాక్ట్‌ నెంబర్‌ పట్టుకున్నాడు. నెమ్మదిగా టచ్‌లోకి వెళ్లాడు. తరచూ మాట్లాడుతున్నాడు. ఒకే సామాజికవర్గం కావడం.. అందునా తన ఫ్రెండ్‌కు అన్నయ్య కావడంతో ఆమె కూడా బాగానే మూవ్‌ అయింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఏదో ఒక ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ హైదరాబాద్‌ బాట పట్టారు. ఈ మధ్యనే ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కలసి జీవిస్తున్నారు. ఈ సంగతులేవీ ఇద్దరూ ఇళ్లలో చెప్పలేదు.

  అయితే ఈ మధ్యనే అతని తండ్రికి ఆపరేషన్‌ జరగడంతో ఇంటికి వెళ్లాడు. అక్కడ కొన్నాళ్లు ఉండాల్సి వచ్చింది. ఈలోగా ఆమె కూడా ఇంటికి వచ్చేసింది. ఇద్దరివీ వేరు వేరు ఊళ్లు అయినా వీరిద్దరూ పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఇంట్లో తెలిసింది. ఒకే సామాజికవర్గం కదా.. ఇంట్లో ఈజీగానే ఒప్పుకుంటారని ఇద్దరూ భావించారు. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. ఎస్టీ బంజారా కమ్యూనిటీలో కొన్ని ఇంటి పేర్ల మధ్య అనాదిగా అన్నదమ్ముల వరుసే ఉంటుందని.. అలా ఉన్న రెండు ఇంటిపేర్ల వాళ్ల మధ్య వివాహ సంబంధాలు సాధ్యం కాదని వాళ్లిద్దరికీ అప్పుడే తెలిసింది. ఉలిక్కిపడ్డారు. ఆమె తండ్రి పరువు పోతుందన్నాడు.. ఆమెను కొట్టాడు. పరువు పోయాక ఇక తాను బతకలేనని కత్తితో చెయ్యి కోసుకున్నాడు.

   ఇది చదవండి : భర్త వేధింపులు భరించలేక భార్య ఘోరం... భర్త పడుకున్నప్పుడు ఆయన...!


  ఇది చూసి ఆమె ఇంకా భయానికి లోనయింది. తన వల్ల జరగరాని తప్పు జరిగిందని.. ఇంటి పేరు తప్పుగా చెప్పి అతను తనను మోసం చేసి పెళ్లికి ఒప్పించాడని ఆమె తీవ్ర మసస్తాపం చెందింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ విషయం అతనికి తెలిసింది. ఆమె లేని జీవితం వృథా అనుకున్నాడు. ఇంట్లో ఉన్న గడ్డ మందు తాగాడు. ఇంకా బాధ తీరక ఊళ్లో ఉన్న బావిలో దూకాడు. అంతే ఊళ్లో వాళ్లంతా అతన్ని బయటికి తీశారు. పరిస్థితి విషమంగా ఉందని హైదరబాద్‌లోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతను ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.

  ఒక ప్రేమ.. ఒక పెళ్లి.. ఒక అబద్దం.. ఒక నిండు ప్రాణాన్ని తీసేయగా.. ఇంకో ప్రాణం నిలబడుతుందో లేదో చెప్పలేని స్థితిలో ఉంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం పంచాయతీ నెహ్రూనగర్‌కు చెందిన బోడ శ్వేత, నిజాంపేట పంచాయతీ కట్టుగూడేనికి చెందిన గుగులోత్‌ వెంకటేష్‌ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ మధ్యే హైదరాబాద్‌లో్ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి కోసం వెంకటేష్‌ తన ఇంటిపేరును ఆమెకు తప్పుగా చెప్పాడని తాజాగా గొడవలు మొదలయ్యాయి. వెంకటేష్‌ అబద్దం చెప్పడం వల్లే తమ బిడ్డ నమ్మి మోసపోయిందని, ఆమె చనిపోయాక ఆమె బంధువులు అతని ఇంటిపై దాడికి దిగారు.


  ఇది చదవండి : సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దళిత కుటుంబాల‌ను వెలి.. కారణం ఇదేనంటున్న వీడిసీలు..

  ఒక ఊరు మరో ఊరిపై దాడికి వచ్చినంత పనయింది. వారిని వారించి సర్దుబాటు చేయడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. తమ కులంలో బోడ, గుగులోత్‌ ఇంటిపేర్ల మధ్య వివాహ సబంధాలు ఉండవని, అన్నాదమ్ముల వరుస అవుతారని, వీళ్లిద్దరూ చేసిందానికి చెడ్డపేరు వచ్చిందన్నది ఊళ్లో వాళ్ల ఆరోపణ. అన్నా చెల్లెళ్ల వరుసయ్యే తాము ఇలా పెళ్లి చేసుకుని పెద్ద వాళ్లకు తలవంపులు తెచ్చామన్నది ప్రేమికుల వేదన. వెరసి ఇద్దరూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. ఆమె ప్రాణాం పోయింది.. అతను ఇంకా ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. తరచుగా చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలపై పెద్దలు మరీ పట్టింపులకు పోకుండా పెద్ద మనసుతో ఆలో్చించాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. పరువు ప్రతిష్టలు, ఆవేశకావేశాలకు పోవడం వల్ల ప్రాణాలు పోవడం తప్ప ఒరిగేదేం ఉండదని చెబుతున్నారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime news, Khammam, Telangana

  ఉత్తమ కథలు