హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: భర్త ఇంట్లో ప్రియుడితో కలిసి భార్య.. చివరకు విషయం తెలుసుకున్న భర్త.. ఏం చేశాడంటే..

Telangana: భర్త ఇంట్లో ప్రియుడితో కలిసి భార్య.. చివరకు విషయం తెలుసుకున్న భర్త.. ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: కట్టుకున్న భార్యే దొంగగా మారింది. ప్రియుడితో కలిసి ఇంట్లో ఉన్న విలువైన సామాన్లను దోచుకెళ్లింది. భార్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  ఏపీలోని గుంటూరు జిల్లా మాచ‌ర్ల మండ‌లం గ‌న్న‌వ‌రం గ్రామానికి చెందిన‌ అర్చ‌న‌, ఖ‌మ్మం జిల్లా కారేప‌ల్లికి చెందిన శివ‌ప్ర‌కాశ్‌ల‌కు 2008లో వివాహ‌మైంది. వీరికి ముగ్గురు పిల్ల‌లు. అయితే దంపతులిద్దరి మధ్య వివాహేతర అంశానికి సంబందించి కలహాలు జరుగుతున్నాయి. దీంతో దంపతులిద్దరూ వేరు వేరుగా ఉంటున్నారు. కుటుంబ గొడ‌వ‌ల కార‌ణంగా అర్చ‌న త‌ల్లిగారింటికి వెళ్లి వేరేగా ఉంటుంది. అక్క‌డే ఏడాదిన్న‌ర కాలంగా బాతుల వెంక‌ట‌కృష్ణ ప్ర‌సాద్ అనే వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. దీంతో అతనితో కలసి జీవనం కొనసాగించాలని అర్చన నిర్ణయించుకుంది. అయితే ఈ మధ్య కాలంలో భర్త శివ ప్రకాశ్ తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. అత్త చనిపోయిన విషయం తెలుసుకుని అంత్య క్రియల్లో పాల్గొనేందుకు అర్చన గుంటూరు నుంచి వచ్చింది. ఇంట్లో విలువైన నగలు, డబ్బులను చూసింది అర్చన. వాటిని ఎలాగైనా కాజేయాలనే పథకం పన్నింది. ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించిన పిమ్మ‌ట త‌న ప్రియుడికి ఫోన్ చేసి ఖమ్మం రమ్మని చెప్పింది.

  ప్రియుడు ప్ర‌సాద్‌ మే 3వ తేదీన ఖ‌మ్మం వ‌చ్చి రైల్వే స్టేష‌న్‌లోనే బ‌స చేశాడు. భర్తతో మంచిగా ఉన్నట్లు నటించి బీరువా తాళాలను తన భర్త నుంచి తీసుకుంది. మే 4వ తేదీ రాత్రి ఇంట్లోని బంగారం, వెండి, ల్యాప్‌టాప్ అన్ని మూట క‌ట్టి ప్రియుడికి ఇచ్చింది. వాటిని అమ్మి న‌గ‌దును భ‌ద్ర‌ప‌ర‌చ‌మంది. తల్లిని పోగొట్టుకున్న బాధలో ఉన్న శివ ప్రకాశ్ మరుసటి రోజే ఇంట్లో నగలు, ల్యాప్ టాప్ చోరీకి గురికావడంతో షాక్ గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 4వ తేదీన అర్ధరాత్రి తన ఇంట్లో 1330 గ్రాముల బంగారం , 2330 గ్రా. వెండితో పాటు ల్యాప్ ట్యాప్ మొత్తం రూ.63 లక్షలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు ఖ‌మ్మం సీసీఎస్‌, కారేప‌ల్లి పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు సిసి ఫుటేజి, వేలి ముద్రల ఆధారాలతో దొంగలను పట్టుకున్నారు.

  సీసీ టీవీ కెమెరాలు, ఇత‌ర వివ‌రాల ఆధారంగా భార్య‌పై అనుమానం క‌లిగి పోలీసులు విచారించారు. విచార‌ణలో చేసిన నేరాన్ని ఒప్పుకుంది. నిందితుల వ‌ద్ద నుండి పోలీసులు బంగారం, వెండి ఆభ‌ర‌ణాలు, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కేసు వియ‌జ‌వంతంగా ద‌ర్యాప్తు చేసిన సీసీఎస్ ఇన్‌స్పెక్ట‌ర్లు పి. న‌వీన్‌, ఇ.శ్రీ‌నివాస్‌, కారేప‌ల్లి సీఐ శ్రీ‌నివాస్‌, ఎస్ సురేశ్‌, కానిస్టేబుళ్లు కె. శ్రీ‌నివాస్‌, బి.మంగ్త్య‌, ఎం.గ‌జేంద్ర ను సీపీ అభినందించారు. ఇటు జైలుపాలైన తల్లిని, అటు తండ్రికి పిల్లలు దూరం కావాల్సి రావడం వారి కుటుంబ సభ్యులను బాధతో కుమిలిపోయేటట్లు చేసింది. సంచలనం సృష్టించిన చోరీ కేసు వివరాలను సీపీ విష్ణువారియర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Crime news, Gold robbery, Khammam, Robbery, Telangana crime

  ఉత్తమ కథలు