Home /News /telangana /

WOMAN PROTEST INFRONT LOVER HOUSE IN ADILABAD DISTRICT VB

Lovers: అతడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్.. యువతిని ప్రేమించి.. పెళ్లికి నిరాకరించాడు.. దీంతో ఆ మహిళ..

యువకుడి ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న బాధిత మహిళ

యువకుడి ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న బాధిత మహిళ

Lovers: ప్రేమించి పెళ్లిచేసుకుంటానని ఓ యువకుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి సదరు యువకుడి ఇంటి ఎదుట నిరసనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరుకలిసి పబ్ లు, పార్కుల వెంట తిరిగారు. అతడు తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం కూడా పొందాడు. దీంతో అతడు ఆమె విషయంలో యూ టర్న్ తీసుకున్నాడు. పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పేశాడు. దీంతో ఆ మహిళ యువకుడి ఇంటి ఎదుట నిరసనకు దిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని టోంకిని గ్రావనికి చెందిన ఓ యువతి (24), సిర్పర్‌(టి) పంచాయతీ పరిధిలోని షేక్‌అహ్మద్‌గూడ కాలనీకి చెందిన దంద్రె తిరుపతి(26) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుంటానని అతడు మొదటి నుంచి ఆమెకు చెప్పుకుంటూ వచ్చాడు.

    ఇటీవలే పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికైన తిరుపతి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో అతడు నిరాకరించాడు. దీంతో ఆమె మోసపోయానని.. సదరు యువకుడి ఇంటి ఎదుట నిరసనకు దిగింది.

    Read Also: ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ.. ‘నువ్వు బాగున్నావ్.. నువ్వంటే ఇష్టం’ అంటూ సీఐ ఆమెను ..


    యువతి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కౌటాల సీఐ బుద్దే స్వామి, ఎస్సై రవికుమార్‌ స్టేషన్‌లో దంద్రె తిరుపతికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అదేవిధంగా జిల్లా మహిళా సంఘం సభ్యులు సంఘటనా స్థలానికి వచ్చి బాధితురాలికి సంఘీభావం తెలిపారు. బాధితురాలికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Adilabad, Crime news

    తదుపరి వార్తలు