WOMAN KILLED WHO IS LIVING RELATIONSHIP IN KUKATPALLY VRY
Hyderabad : దారుణం.. సహజీవనం వద్దని వెళ్లిన మహిళ సజీవదహానం.. ?
crime scene
Hyderabad : గత కొద్ది సంవత్సరాలుగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె నిరాకరించడంతో... సజీవంగానే దహానం చేశాడు. ఆతర్వాత తాను కూడా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆమెకు ఇద్దరు పిల్లలు, భర్తను కోల్పోయింది.. మరోవైపు మరోకరికి భార్య చనిపోయింది ఆయనకు కూడా ఇద్దరు పిల్లలు ఉండడంతో ఆ ఇద్దరు కలిసి నగరంలో సహాజీవనం చేస్తున్నారు. అయితే ఆమెకు నచ్చకపోవడంతో దూరంగా ఉంటుంది. కాని ఆ దూరాన్ని భరించలేని వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన వెంకటలక్ష్మి(50) నాచారంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో కాంటాక్ట్ స్వీపర్‌గా చేస్తుండంతో పాటు ఆమెకు వికలాంగుల పింఛనుదారు కూడా వస్తుంది.. ఆమెకు పదేళ్ల క్రితమే భర్త చనిపోయాడు... కాగా ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు....ఇటివల కుమార్తెకు వివాహం కూడా చేసింది. అయితే వెంకటలక్ష్మికి గత కొన్ని సంవత్సరాల క్రితం నగరంలోని జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో ఉండే వెంకటేష్(55)తో పరిచయం ఏర్పడింది. వెంకటేష్‌కు సైతం భార్య చనిపోగా ఆయన కుమారుడితో ఉంటున్నాడు.
వెంకటేశ్‌కు కూడా స్థానికంగా వెల్డింగ్ దుకాణం ఉండడంతో దానితో ఉపాధి పొందుతున్నాడు..కాగా వెంకటలక్ష్మి, వెంకటేశ్‌ల పరిచయంతో ఇద్దరు కలిసి కొన్నేళ్ల పాటు సహజీవనం చేశారు.అయితే ఇటివల ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వెంకటలక్ష్మి తన కుమారుడితో కలిసి కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌కు మకాం మార్చింది. అయితే.. తనతోనే ఉండాలని వెంకటేష్ పలుమార్లు ఆమెపై ఒత్తిడి తెచ్చి వేధించాడు. కాని...ఆమె అంగీకరించకపోవడంతో... సహజీవనం చేసిన ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం వెంకటలక్ష్మి కుమారుడు ఉద్యోగానికి వెళ్లాడు. దీంతో అదును కోసం చూస్తున్న వెంకటేశ్ రాత్రి 8 గంటల సమయంలో ఆమె వద్దకు వెళ్లాడు. దీంతో వద్దన్నా ఇంటికి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఈ క్రమంలోనే వెంకటేశ్ దారుణానికి పాల్పడ్డాడు. ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్టు తెలుస్తోంది. దీంత ఆమె ఇంట్లో నుంచి మంటలు ఎగసి పడుతుండటాన్ని గమనించిన స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూశారు. కాలిన గాయాలతో వెంకటలక్ష్మి చనిపోయి ఉండగా... వెంకటేష్ సైతం కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు.. హుటాహుటిన అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇద్దరి మధ్య ఏం జరిగింది స్పష్టం తెలియ రాలేదు.. అయితే.. గొడవ జరగడంతో ఆవేశంలో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ క్రమంలో మంటలు అతనికీ అంటుకుని ఉంటాయని అనుమానిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.