Home /News /telangana /

WOMAN FROM ADIALABD IS GOING TO PARTICIPATES IN ASIAN WOMAN HANDBALL GAMES VRY ADB

Adilabad : అడవి నుండి అంతర్జాతీయ స్థాయికి.. ఏషియన్ ఉమెన్ గేమ్స్‌లో ఆదిలాబాద్ జిల్లా క్రిడాకారిణి...

ఏషియన్ గేమ్స్ లో పాల్గోనున్న కరీనా

ఏషియన్ గేమ్స్ లో పాల్గోనున్న కరీనా

Adilabad : నిరుపేద కుటుంబంలో పుట్టినా…కష్టాలతో ఏమాత్రం కుంగిపోకుండా… ఆటలపై ఆసక్తితో కఠోరమైన సాధనను జోడించి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో దేశం నుండి ప్రాతినిధ్యం వహించే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.అయితే అక్కడి ఖర్చుల కోసం ఎవరైనా దాతల సహాయం కోరుతోంది ఆ క్రిడాకారిణి.

ఇంకా చదవండి ...
    (కట్టా లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా)

    అడవుల జిల్లా అయిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వాంకిడి మండలం చిచ్చుపల్లి గ్రామానికి చెందిన కరీనా... ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న కరీనా తల్లిదండ్రులు మడావి రమేష్, గిర్జుబాయి వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేస్తుంటారు. కరీనా తండ్రి రమేష్ ఖాళీ సమయంలో ఆటో కూడా నడుపుతుంటాడు.  కరీనాకు ఇద్దరు తమ్ములు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. కాగా కరీనా ఆసిఫాబాద్ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుంది. ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నసమయంలో క్రీడలపై కరీనాకు ఉన్న ఆసక్తిని గమనించిన ఉపాధ్యాయులు ఆమెను ప్రోత్సహించారు. దీంతో తక్కువ సమయం లోనే కరీనా హ్యాండ్ బాల్ క్రీడను మెరుగుపర్చుకుని పలుమార్లు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తన సత్తా చాటింది.

    తాజాగా ఏషియన్ యూత్ ఉమెన్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైంది. మార్చి 18వ తేది నుండి మొదలయ్యే 9వ ఏషియన్ యూత్ ఉమెన్ హ్యాండ్ బాల్ పోటిల్లో దేశ జట్టు తరఫున పాల్గొననుంది. అయితే భారత దేశం తరఫున ఈ పోటీల్లో పాల్గొనే హ్యాండ్ బాల్ జట్టు ఎంపిక కోసం ఈనెల 12, 13 తేదీల్లో లక్నోలో 200 మంది క్రీడాకారులతో క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో పాల్గొన్న కరీనా సత్తా చాటి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనె దేశ జట్టుకు ఎంపికైంది. దేశ జట్టుకు దక్షిణ భారతం నుండి ఎంపికైన ఏకైక క్రీడాకారిణిగా కరీనా నిలిచింది. అంతర్జా తీయస్థాయిలో జిల్లా పేరును నిలబెట్టింది. కాగా దేశ జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు మార్చి 4 నుంచి 16వ తేదీ వరకు పంజాబ్ లోని లన్వీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తారు.

    Hyderabad : హ్యాట్సాఫ్ to సీఎం కేసిీఆర్.. విజయవాడలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన పవన్ ఫ్యాన్స్.

    అనంతరం వీరు కజికిస్తాన్ లోని ఆల్మటి పట్టణంలో మార్చి 18నుంచి 9వ ఏషియన్ యూత్ ఉమెన్ హ్యాండ్బాల్ ఛాంపియన్‌షిప్‌ లో పాల్గొంటారు. అయితే  తెలంగాణ రాష్ట్రం గర్వించేలా అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న కరీనాకు పేదరికం సమస్యగా మారింది. కజికిస్తాన్ లో జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు వీసా, ఆట సామగ్రి, ప్రయాణ ఖర్చులు ఇతరత్ర అన్ని ఖర్చులు కలుపుకొని సుమారు రెండు లక్షల రూపాయల వరకు అవసరమవుతుందని క్రీడా శిక్షకులు అంటున్నారు. కాగా ఇదివరకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్ రావు 25 వేల రూపాయల ఆర్థికసాయం అందించారు. మరికొందరు దాతలు ముందుకొచ్చి ఆర్థిక చేయూతను అందిస్తే తాను అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతానని కరీనా ఆశాభావం వ్యక్తంచేస్తోంది. మరోవైపు తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో స్థానం సంపాదించిన మడావి కరీనాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Telangana

    తదుపరి వార్తలు