Egg Killed Woman: షాకింగ్.. మహిళ ప్రాణం తీసిన కోడిగుడ్డు.. ఊపిరాడక క్షణాల్లో మృతి

ప్రతీకాత్మక చిత్రం

Woman died after eating egg: కోడి గుడ్డు (Egg) తిని ఓ మహిళ కన్నుమూసింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం.

 • Share this:
  ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూ ఊహించలేరు. మన అదృష్టం బాగా లేకుంటే.. అరటి పన్ను తిన్నా పన్ను ఊడిపోతుంది.  ఒక్క క్షణంలో జీవితం తలకిందులై పోతుంది. అప్పటిదాకా బాగున్న వారు  కూడా హఠాత్తుగా మరణించవచ్చు. టీ తాగుతూ చనిపోయిన ఘటనలనూ గతంలో పలుమార్లు వార్తల్లో చూశాం. చిన్న దానికే ప్రాణాలు పోయిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఈ సమాజంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి. తాజాగా నాగర్‌కర్నూల్ (Nagar Kurnool) జిల్లాలో విషాదం నెలకొంది. కోడి గుడ్డు (Egg) తిని ఓ మహిళ కన్నుమూసింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. తిమ్మాజి పేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

  చాణక్య నీతి.. ఈ భూమిపై అతి భయానకమైన వ్యాధి ఇదే!

  స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. నేరళ్లపల్లి గ్రామానికి చెందిన నీలమ్మ (50) అనే మహిళ బుధవారం రాత్రి ఎప్పటిలాగే భోజనం చేశారు. నిన్న భోజనంతో పాటు ఉడకబెట్టిన కోడి గుడ్డు (Boiled Egg) కూడా తీసుకున్నారు. గుడ్డును ముక్కలుగా కోయకుండా.. మొత్తం నోట్లోకి వేసుకున్నారు. అనంతరం నమిలేందుకు ప్రయత్నించగా.. అది ఒక్కసారిగా గొంతులోకి జారిపోయింది. గుడ్డు గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక నీలమ్మ విలవిల్లాడిపోయారు. శ్వాస ఆగిపోయి అక్కడిక్కడే కుప్పకూలారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి గుడ్డుని గొంతులో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. శ్వాస అందక నీలమ్మ కన్నుమూశారు. ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటిదాకా తమ ముందే ఉన్న మనిషి.. క్షణాల్లోనే మరణించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. నీలమ్మ మృతిని తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

  Boy Murder Mystery: చిత్తూరు జిల్లా బాలుడు హత్య కేసులో సంచలన నిజాలు..

  తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆహారంలో చికెన్ గ్రేవీ, కూల్ డ్రింగ్ తీసుకొని తల్లీకూతుళ్లు మరణించారు. తూత్తుకుడి జిల్లా కోవిల్‌ పట్టిలోని తంగప్ప నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్పగం అనే 30 ఏళ్ల మహిళ స్థానికంగా ఓ హోటల్ నుంచి చికెన్ గ్రేవీ తీసుకొచ్చారు. బుధవారంమధ్యాహ్నం తన కూతురి (4)తో కలిసి ఆ చికెన్ గ్రేవీతో భోజనం చేశారు. కానీ అది తిన్న కాసేపటికే కడుపులో వికారంగా అనిపించింది. భోజనం అరగక ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత మరో దుకాణం నుంచి కూల్ డ్రింగ్ తెచ్చుకొని సేవించారు. ఐనా సమస్య తగ్గలేదు. కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చుట్టుపక్కల వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా... మార్గమధ్యలోనే కన్నుమూశారు. వీరి మృతికి కారణమేంటన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: