గిలగిలా కొట్టుకుంటున్న భార్య.. అర్ధరాత్రి ఆస్పత్రి నుంచి గెంటేసి..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా అనే అనుమానంతో హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రులు తిప్పాడు. ఎక్కడా చేర్చుకోలేదు. దీంతో చివరకు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు.

 • Share this:
  అతడు ఓ హెడ్ కానిస్టేబుల్.. అతడి భార్యకు ఉన్నట్టుండీ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతోంది. కరోనా వైరస్ సోకడమో.. లేక మరే కారణమో స్పష్టంగా తెలియదు. భార్య పడుతున్న ఇబ్బంది చూడలేక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఎక్కడా చేర్చుకోలేదు. తీరా గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే శ్వాస తీసుకోవడంలో మరింతగా ఇబ్బంది పడుతోంది. కానీ గాంధీ ఆస్పత్రిలోకి అనుమతి లేదంటూ అక్కడ విధుల్లో ఉన్న ఓ సీఐ నిరాకరించాడు. తాను ఓ హెడ్ కానిస్టేబుల్‌నని.. నా భార్య పరిస్థితి విషయంగా ఉందని చెప్పినా లోపలికి అనుమతించలేదు. హైదరాబాద్‌లోని అన్ని ఆస్పత్రులు తిప్పాను. కరోనా ఉందో లేదు తెలియదు సర్ అన్నా పట్టించుకోలేదు. ఫలితంగా హెడ్ కానిస్టేబుల్ ముందే అతడి భార్య చనిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు లతీఫ్ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన భార్యకు ఉన్నట్టుండీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

  కరోనా అనే అనుమానంతో హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రులు తిప్పాడు. ఎక్కడా చేర్చుకోలేదు. దీంతో చివరకు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే శ్వాస ఆడక గిలగిలా కొట్టుకుంటోంది. అయితే గాంధీ ఆస్పత్రిలోకి అనుమతి లేదంటూ అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సీఐ నిరాకరించాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్.. ‘సర్ ఇప్పటికే చాలా ఆస్పత్రులు తిప్పాము. ఎక్కడ చేర్చుకోలేదు. కరోనా ఉందో లేదో తెలియడం లేదు. దయచేసి లోపలికి పంపండి. నేను పోలీసు శాఖలోనే పనిచేస్తున్నాను. వెంటిలేటర్ పెడితే నా భార్య బతుకుతుందంటూ’ సీఐను బతిమిలాడాడు.

  ఓ అడిషనల్ డీసీపీతో ఫోన్ చేయించాడు. అయినా సీఐ కనికరించలేదు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సదరు సీఐ వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. వేరే ఆస్పత్రికైనా తీసుకెళదామంటూ అక్కడి నుంచి హెడ్ కానిస్టేబుల్ భార్యను తీసుకుని కిలోమీటరు వెళ్లాడో లేదో భార్య ప్రాణాలు వదిలింది. ఊపిరాడక కాళ్లు చేతులు గిలగిలా కొట్టుకుంటూ నరకయాతన అనుభవిస్తూనా కళ్లముందే చనిపోయిందంటూ హెడ్ కానిస్టేబుల్ లతీఫ్ కన్నిటీ పర్యంతమయ్యాడు.
  Published by:Narsimha Badhini
  First published: