Home /News /telangana /

WOMAN DELIVERS IN FOREST AT BHADRADRI KOTHAGUDEM BN

అడవిలో నిండు గర్భిణీ నరకయాతన.. మూడు కిలోమీటర్లు భర్త భుజాలపైనే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ గర్భిణీ బాధ చూడలేక ఆమె భర్త మాస.. ఎర్రంపాడు నుంచి చెన్నారం వరకు దాదాపు మూడు కిలోమీటర్లకు పైగా మెసుకెళ్లాడు.

  ప్రస్తుతం ఉన్న అత్యాధునిక యుగంలోనూ అడవిబిడ్డలకు అపోసోపాలు తప్పడం లేదు. నింగిలోకి రాకెట్‌లో దూసుకువెళుతున్న తరుణంలో కనీస రోడ్డు సదుపాయం లేక అవస్థలు పడుతున్న ప్రాంతాలు లేకపోలేదు. మారుమూల ప్రాంతాల్లో ఇంకా సగానికి పైగా గ్రామాల్లో రోడ్డెరుగని గ్రామాలు.. విద్యుత్ బల్బును చూడని గిరిజన గూడెలు ఉన్నాయి. ఈ గ్రామంలోని వారంతా అత్యవసర సమయాల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడేవారు.. గర్భిణీలు ఆస్పత్రులకు వెళ్లాలంటే పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. తాజాగా ఇలాంటి ఘటనొకటి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. సరైన రోడ్డు మార్గం లేక అంబులెన్సు వచ్చే పరిస్థితి లేక అడవిలోనే పురిటినొప్పులతో నరకయాతన అనుభవించి ప్రసవించిన ఘటన అది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కీకారణ్యమైన ఎర్రంపాడు గ్రామానికి చెందిన కొవ్వాసి ఐతే అనే మహిళ నిండు గర్భిణీ.

  తాజాగా ఆమె పురిటినొప్పులతో బాధపడుతోంది. గ్రామానికి వచ్చేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్సు వచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఫోన్ సిగ్నల్ సైతం లేదు. ఆ గర్భిణీ బాధ చూడలేక ఆమె భర్త మాస.. ఎర్రంపాడు నుంచి చెన్నారం వరకు దాదాపు మూడు కిలోమీటర్లకు పైగా మెసుకెళ్లాడు. గర్భిణీ భర్త మాసకు తోడుగా ఆశా కార్యకర్త సోమమ్మ సాయం చేసింది. మూడు కిలోమీటర్లు అడవిలో కాలినడక భర్త భుజాలపై గర్భిణీని మోసుకొచ్చాక.. అక్కడ ఫోన్ సిగ్నల్ దొరికింది.

  దీంతో స్థానికంగా ఉన్న యువకులు 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. అయితే 108 వాహనం వచ్చేసరికి గర్భిణీ అడవిలోనే ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మినిచ్చిన అనంతరం అంబులెన్సు అక్కడకు చేరుకుంది. బాలింతతో పాటు అప్పుడే పుట్టిన బిడ్డను ప్రాథమిక చికిత్స తర్వాత 108 వాహనంలో సత్యనారాయణపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
  Published by:Narsimha Badhini
  First published:

  Tags: Badradri, Pregnant, Telangana

  తదుపరి వార్తలు