పోలీసులంటే(Telangana police) శాంతి భద్రతలు కాపాడడమే కాదు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కూడా వారి డ్యూటిలో భాగమైంది. నిత్యం అందుబాటులో ఉండి ఉద్యోగం చేస్తున్న పోలీసుల సేవలు మరింత విస్తృతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా మేమున్నమంటూ పోలీసులు ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలోనే గణేష్ నిమజ్జనం (ganesh immersion) సందర్భంగా బందోబస్తులో ఉన్న పోలీసులు, ప్రసవ వేదన పడుతున్న ఓ మహిళను ఆసుపత్రికి(hospital) తరలిస్తుండగా, వారి వాహనంలోనే కాన్పు జరిగింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఇది చదవండి : అక్కడ అత్తను కొట్టి.. ఇక్కడ అత్యాచారం చేసిన సైదాబాద్ క్రిమినల్
ఇటిక్యాల మండలం, బీచుపల్లిలో మంగళవారం రాత్రి వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఈ సందర్భంగా కానిస్టేబుల్ ప్రసాద్, రఫీ అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీచుపల్లికి చెందిన వైష్ణవికి బుధవారం తెల్లవారుజామున ఒంటిగంటకు పురిటినొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆశ వర్కర్ లలితమ్మ వారికి తెలపడంతో కానిస్టేబుల్ ప్రసాద్ పోలీస్ వాహనంలో ఆమెను గద్వాల(Gadwal) ప్రభుత్వ ఆసుపత్రికి(govt hospital) తీసుకెళ్లేందుకు ముందుకొచ్చారు.
ఇది చదవండి : రైతులకు శుభవార్త.. సొంత స్థలంలో డబుల్ నిర్మాణాలకు పదివేల కోట్లు.. !
ఈ క్రమంలోనే వాహనంలో తీసుకొస్తుండగా, గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఆర్వోబీ వద్దకు రాగానే వైష్ణవికి నొప్పులు అధికమయ్యాయి. ఈ క్రమంలోనే గర్భిణితో (pregnant) పాటు ఉన్న ఏఎన్‌ఎం పోలీసు వాహనంలో కాన్పు నిర్వహించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ప్రసవం తర్వాత తల్లీ బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. ఇందుకోసం సహకరించిన పోలీసులకు వారు ధన్యవాదాలు (thanks)తెలిపారు.
ఇది చదవండి : కన్నీరు పెట్టిస్తున్న నవ వధువు సూసైడ్ నోట్.. ఎవ్వరినీ వదలొద్దు సార్ అంటూ లేఖ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gadwal, Telangana Police