వాళ్లు చెప్పిన ఒకే ఒక్క మాటను నమ్మి ఇంట్లో తవ్వకాలు.. రూ.21 లక్షలు ఇచ్చి మరీ వారం పాటు పూజలు.. తీరా చూస్తే..

మోసపోయిన మహిళ (ఫైల్ ఫొటో)

ఇటీవలే గ్రామానికి వచ్చిన కోయ పూజారులు ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని ఓ మహిళకు చెప్పారు. ఆ మాటలను నమ్మి ఓ మహిళ తన ఇంట్లో వారితో తవ్వకాలు జరిపించింది. ఈ తవ్వకాల్లో దేవుని ప్రతిమ, ఇత్తడి బిందె, బంగారం లభించాయి. ఆ తర్వాత..

 • Share this:
  డబ్బు పట్ల మనుషుల్లో ఉండే ఆశే, మోసకారులకు ఆయుధంగా మారుతోంది. దాన్నే ప్రధానాస్త్రంగా చేసుకుని వింత వింత మోసాలకు పాల్పడుతున్నారు. ఓ వైపు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతో మంది అమాయకులు చిక్కుకుంటోంటే, మరో వైపు గుప్త నిధులు ఉన్నాయంటూ మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ముఠాలు కూడా పెద్ద సంఖ్యలో పెరిగిపోయాయి. హైదరాబాద్ నగరంలో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మల్ జిల్లాలోనూ ఇదే తరహా ఘటన ఒకటి వెలుగు చూసింది. గుప్త నిధులు ఉన్నాయంటూ, కోటీశ్వరురాలివి కాబోతున్నావంటూ ఓ మహిళకు కొందరు కోయ పూజారులు ఆశ చూపారు. వారి మాటలు నమ్మిన ఆ మహిళ ఏకంగా 21 లక్షల రూపాయలను పోగొట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూర్ లో గుప్త నిధుల వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. పెద్దూరు కు చెందిన ఓ మహిళ గుప్త నిధుల వేటలో మోసపోవడంలో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కడెం పోలీస్ స్టేషన్ లో గత నెల 26 న బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కడెం పెద్దూర్ గ్రామంలో ఇటీవలే గ్రామానికి వచ్చిన కోయ పూజారులు ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని ఓ మహిళకు చెప్పారు. ఆ మాటలను నమ్మి ఓ మహిళ తన ఇంట్లో వారితో తవ్వకాలు జరిపించింది. ఈ తవ్వకాల్లో దేవుని ప్రతిమ, ఇత్తడి బిందె, బంగారం లభించాయి.
  ఇది కూడా చదవండి: ప్లీజ్.. నన్ను రెండో పెళ్లయినా చేసుకోమని కోరిన యువతి.. నో చెప్పిన ప్రియుడు.. ఆ భగ్న ప్రేమికురాలు ఎంతకు తెగించిందంటే..

  వాటికి వారం రోజుల పాటు ఊరు బయట పూజలు నిర్వహించి విప్పితే ఆ మొత్తం మీకు దక్కుతుందని చెప్పారు. ఆమె అదే విధంగా చేసింది. వారం రోజుల తర్వాత చూస్తే అవన్నీ నకిలీవని తేలింది. దీంతో మోసపోయానని ఆమె గ్రహించింది. తనను మోసం చేశారని సదరు మహిళ ఆరోపించింది. ముగ్గురు కోయ పూజారులు 21 లక్షలు పట్టుకెళ్లి మోసం చేశారని బాధిత మహిళ పేర్కొంది. దీనిపై కడెం పోలీస్ స్టేషన్లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఈ గుప్త నిధుల వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ కొనసాగుతుంది.
  ఇది కూడా చదవండి: పెళ్లి పీటల వద్దకు వస్తూ.. సడన్ గా వెనక్కు వెళ్లిపోయిన వధువు.. కారణం తెలిసి నోరెళ్లబెట్టిన వరుడు.. చివరకు..
  Published by:Hasaan Kandula
  First published: