Home /News /telangana /

Karimnagar : తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న.. లైవ్‌లో ప్రాణాలు విడిచిన మహిళ

Karimnagar : తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న.. లైవ్‌లో ప్రాణాలు విడిచిన మహిళ

వేధింపులకు గురి చేసిన కనకయ్య

వేధింపులకు గురి చేసిన కనకయ్య

Karimnagar : సొంత తమ్ముడి భార్యపై కన్నేశాడు ఓ దుర్మార్గుడు,తమ్ముడి కుటుంబం ఆర్ధిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ( woman commits suicide ) దీంతో వేధింపులు భరించలే ఆ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇంకా చదవండి ...
  కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్ మండలం పొగాకులపల్లికి చెందిన ముంజం అరుణ తన భర్త రాజుతో కలిసి కాపువాడలో నివాసముంటోంది. భర్త రాజు ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. అరుణ టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ( sexual harassment )వీరికి ఇద్దరు కుమారులు కాగా.. ఒకరు భార్యతో పాటు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ఇంకో కుమారుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇలా వారి సంసారం సాఫిగా సాగుతున్న సమయంలో అరుణ బావా కన్నేశాడు.

  ఆర్ధిక ఇబ్బందులే ఆసరాగా..

  కాగా లాక్​డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు రావటం వల్ల.. తన బావా అయిన ముంజం కనకయ్య వద్ద పదివేల రూపాయలు అప్పుగా అరుణ అప్పుగా తీసుకుంది. ( woman commits suicide after sexual harassment ) దీంతో దాన్ని ఆసరా చేసుకుని ఆమె ఇంటికి తరచుగా వచ్చేవాడు కనకయ్య. డబ్బులు లేక అప్పు తీర్చకపోవడంతో వేదింపులకు దిగాడు. అప్పు పేరిట ఆమెను ఎలాగైనా అనుభవించానే కోరితో వేధింపులు కొనసాగించాడు. ఇందుకోసం ఇచ్చిన అప్పును మూడింతలు చేశాడు. పది వేలు తీసుకుంటే 30 వేలు ఇచ్చానంటూ బెదిరింపులకు దిగాడు. తరచు ఇంటికి రావడంతో పాటు ఫోన్లో కూడా వేధింపులకు గురి చేశాడు. (woman commits suicide after sexual harassment )అయితే ఆమె మాత్రం వాడికి లొంగలేదు. తన భర్తకు అన్యాయం చేయలేని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది.


  Paddy issue : వరి వేయండి.. కోనుగోలు భాద్యత నాదే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే


  అయినా ఆ కామంధుడు పట్టించుకోలేదు. తన కోరిక తీర్చాల్సిందేనని వెంటపడ్డాడు. దీంతో ఏం చేయాలో తెలియని ఆందోళన ఆమెలో రెట్టింపు అయింది. బయట చెప్పుకుంటే పరువు పోతుందని భాదపడింది. చివరికి పోలీసులకు చెబుతామన్నా ధైర్యం రాలేదు.. ఇలా చివరకు వేధింపులు ఎక్కువ కావడంతో ఏం చేయాలో తోచని ఆమె తాను చేయని తప్పుకు బలై పోయింది.


  Karimnagar : ఓటర్లు లేకుండానే ఎన్నికల ప్రచారం.. స్థానికంలో అభ్యర్థుల అయోమయం


  సెల్ఫీ వీడియో

  అయితే చివరి క్షణాల్లో ఆమె పడిన ఆవేదనంతా సెల్ఫీ వీడియో ద్వారా రికార్డ్ చేసింది. బావ చేసిన ఆగడాలను పేపరుపై పెట్టింది. సూసైడ్ నోటు పై నమ్మకం లేక నేరుగా వీడియో రికార్డు కూడా చేసుకుంది. చావు నోట్లో తలపెట్టిన ఆమె తన భర్తతో పాటు పిల్లలను క్షమించమని వేడుకుంది. (woman commits suicide after sexual harassment ) ఎవ్వరిని నమ్మవద్దని హితవు పలికింది. చివరకు ఆమె ప్రాణాలు తీసుకుంది. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె మాటలు వింటున్న నెటిజన్లు నిందితుడికి సరైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  మీ నగరం నుండి (కరీంనగర్)

  తెలంగాణ
  కరీంనగర్
  తెలంగాణ
  కరీంనగర్
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Karimnagar, Suicides

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు