Home /News /telangana /

WOMAN COMMITS SUICIDE AS REJECTING BY HER HUSBAND AT HUZURABAD VRY

Huzurabad : కడప నుండి కరీంనగర్‌కు చేరింది, అయినా.. యువతికి దక్కని న్యాయం, చలిలోనే..! ఇంతకి ఏం జరిగింది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad : తన ప్రేమ దక్కించుకునేందుకు ఓ మహిళ చేసిన 41 రోజుల ప్రేమ పోరాటం నిష్ప్రయోజనంగా మారింది.. భర్త కోసం ఇంటిముందే చలిలో వేచి చూసినా.. ఆ కుటుంబం మనసు కరగలేదు.. చివరికి తన ప్రయత్నం ఫలించకపోవడంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.

  తన ప్రేమను దక్కించుకునేందుకు ఓ యువతి సహసమే చేసింది.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి,  ఆ తరవాత కొద్దిరోజులకు తనను కాదని వెళ్లిపోవడంతో ఆ ఆయన మనసును సంపాదించుకునేందుకు భర్త ఇంటికి చేరింది. కాని, తాళీ కట్టిన  భర్తతో పాటు అత్తవారింటి కుటుంబ సభ్యులు సైతం ఆమెను కనీసం ఇంట్లోకి కూడ రానీయ లేదు.. దీంతో ఆ యువతి పట్టువీడలేదు.. తనను చీదరించిన ఇంటిముందే న్యాయపోరాటానికి దిగింది. భర్త ఇంటిముందే సుమారు నలబై రోజుల పాటు పోరాటం చేసింది. అయితే ఆమె పోరాటానికి భయపడ్డ కుటుంబం ఇంటికి తాళం వేసుకుని పారిపోయింది.

  కాని ఆమె మాత్రం ఆ ఇంటిని వీడలేదు.. దీనికి తోడు చుట్టుపక్కల వారు సైతం ఆమెకు సహాయం చేయాలని చూసినా... వారిపై కుటుంబ సభ్యులు దాడి మొదలు పెట్టారు. దీంతో భయపడిన స్థానికులు తమకు సంబంధం లేదంటూ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారు. ఇలా చలిలోనే 41 రోజుల పాటు ఇంటిముందే నిరసన వ్యక్తం చేసింది. కాని చివరకు  ఆమె పోరాటం మాత్రం  ఫలించలేదు.. అండగా ఉండేందుకు ఏ మహిళా సంఘాలు దరి చేరలేదు.. అక్కున చేర్చుకుని న్యాయం చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు.  అప్పుడప్పుడు  మీడియాలో వచ్చినా పోలీసులు కూడా స్పందించని పరిస్థితి ఏర్పడింది.

  Telangana News : అయ్యో పాపం .. కడుపులో ఉన్న శిశువు ఏం చేసిందమ్మా... నిండు గర్భిణి దారుణం..!


  ఇంటి ముందు న్యాయ పోరాటం చేస్తున్న సమయంలోనే  తాను కావాలనుంటున్న భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే వార్త బాధిత మహిళ చెవిన పడింది. దీంతో తాను ఎన్నాళ్లు పోరాటం చేసిన ఫలితం దక్కదనుకుంది. తాను ఏదో తప్పు చేశాననే ఫీలింగ్‌లోకి వెళ్లిపోయింది. తనకే సొంతం అనుకున్న భర్త మరోకరిని ఇష్టపడడం ఆమె భరించలేకుండా పోయింది. అసలే ప్రేమ పెళ్లి ,తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తిరిగి తల్లి గారింటికి వెళితే.. అవమానాలు తప్పవని భావించిందో ఏమో.. ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.

  వివరాల్లోకి వెళితే... కడప జిల్లాకు చెందిన యువతి సుహసిని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన సుజీత్ రెడ్డితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ  పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే నవంబర్ 2020లో ఇద్దరు కలిసి ఇంట్లోవారికి చెప్పకుండా ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు..కొద్ది నెలల పాటు బాగానే ఉన్న సుజీత్ రెడ్డి,  కొద్ది రోజుల తర్వాత ఇంట్లోవాళ్లను ఒప్పించి ఇంటికి తీసుకువెళతానని నమ్మించి,   తన సొంత ఊరు హుజురాబాద్‌కు చేరుకున్నాడు. ఇంటికి వెళ్లిన తర్వాత  తల్లిదండ్రులతో విషయం చెప్పాడు.. అయితే సుజీత్ రెడ్డి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తాను కూడా  ప్లేట్ ఫిరాయించాడు.

  Nalgonda : ట్యూషన్ పేరుతో 12 మంది బాలికలపై అఘాయిత్యం .. కోర్టు కీలక తీర్పు..


  ఇలా కొన్ని నెలల పాటు ఒంటరిగానే వేచి చూసిన సుహాసిని ఫోనో‌లో మాట్లాడే ప్రయత్నం చేసింది. అయినా సమాధానం రాకపోవడంతో తనకు జరగబోయో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఆమె గత నవంబర్‌లో సుజిత్ రెడ్డి ఇంటికి చేరుకుంది. అయినా.. వారు కనీసం ఆమెను ఇంట్లోకి రానీయలేదు. దీంతో ఆమె మొండికేసింది. వారితో వాగ్వావాదానికి దిగింది.  విషయం బయటి ప్రపంచానికి తెలియడంతో సుజిత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటినుండి పారిపోయారు. అడ్రస్ తెలియకుండా మెయింటెన్ చేశారు..

  దీంతో సుహాసిని తన భర్తతో ఉండడం కోసం  ఆయన ఇంటిముందే గత 41రోజులుగా బైఠాయించింది. ఇలా రోజులు గడుస్తున్నా వారి నుండి స్పందన రాలేదు.. మరోవైపు సుజీత్ రెడ్డి మరో పెళ్లి చేసుకున్నాడని ఆమెకు తెలిసింది. దీంతో మనస్థాపం చెందిన సుహాసిని బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు  వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పోందుతూనే సుహాసిని  ప్రాణాలు విడిచింది.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Huzurabad, Karimangar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు