భర్తతో తెగదెంపులు.. పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్న 25 ఏళ్ల యువతికి ఓ వ్యక్తి పెళ్లి ప్రపోజల్.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పుప్పాల్ గూడలో ఈశ్వరమ్మ అలియాస్ లక్ష్మి అనే 25ఏళ్ల మహిళ ఉంటోంది. ఆమెకు కొన్నేళ్ల క్రితమే కెతావత్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా. అయితే భర్త ప్రతిరోజూ ఆమెను హింసించేవాడు. దీంతో..

 • Share this:
  స్త్రీలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోతోంది. దిశ, నిర్భయ వంటి చట్టాలు వచ్చినా స్త్రీలపై జరుగుతున్న దాడులు మాత్రం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ప్రేయసి మోజులో పడి భార్యలను భర్తలు హతమార్చడమో, ప్రేమించలేదన్న కారణంతో ప్రియుడి రూపంలో యువకులు రెచ్చి పోవడమో జరుగుతోంది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల రూపంలో, కాలేజీల్లో స్నేహితులు, లెక్చరర్ల రూపంలో, ఆఫీసుల్లో కొలీగ్స్ రూపంలో కామాంధులు పొంచి ఉన్నారు. చివరకు సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కూడా స్త్రీకి రక్షణ లేకుండా పోతోంది. తాజాగా ఓ మహిళ వేధింపులకు బలయిపోయింది. భర్త పెట్టే నరకాన్ని భరించలేక పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంటే, ఓ కామాంధుడు ఆమెపై కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ వేధించాడు. అతడి వేధింపులను భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పుప్పాల్ గూడలో ఈశ్వరమ్మ అలియాస్ లక్ష్మి అనే 25ఏళ్ల మహిళ ఉంటోంది. ఆమెకు కొన్నేళ్ల క్రితమే కెతావత్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా. అయితే భర్త ప్రతిరోజూ ఆమెను హింసించేవాడు. మద్యం తాగి చిత్రహింసలు పెట్టేవాడు. దీంతో భర్త పెట్టే బాధలు భరించలేక అతడి నుంచి విడిపోయి పిల్లలతో కలిసి పుప్పాల్ గూడలో ఉంటోంది. అయితే ఒంటరిగా ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి ఉంటున్న లక్ష్మిపై స్థానికంగా ఉంటున్న ఉన్యానాయక్ కన్ను పడింది.
  ఇది కూడా చదవండి: పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు.. అసలు కారణం ఏంటని నేరుగా అతడికే వధువు ఫోన్ చేస్తే..

  ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకోవాలనుకున్నాడు. పెళ్లి చేసుకుంటాననీ, కలిసి ఉందామనీ కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. ఆమె అంగీకరించకపోవడంతో ప్రతీ రోజూ ఆమెను వేధించేవాడు. ఓవైపు భర్త పెట్టే బాధలు భరించలేక వేరుగా ఉంటోంటే, మరో వైపు ఉన్యానాయక్ వేధింపులు తోడవడంతో లక్ష్మి మానసికంగా కుంగిపోయింది. అతడి వేధింపులు భరించలేక శుక్రవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, లక్ష్మి ఆత్మహత్యకు కారణమయిన ఉన్యానాయక్ పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
  ఇది కూడా చదవండి: పెళ్లి పీటల వద్దకు వస్తూ.. సడన్ గా వెనక్కు వెళ్లిపోయిన వధువు.. కారణం తెలిసి నోరెళ్లబెట్టిన వరుడు.. చివరకు..
  Published by:Hasaan Kandula
  First published: