Home /News /telangana /

WOMAN ATTEMT TO SUICIDE FOR DOUBLE BEDROOM AT MRO OFFICE VRY MDK

Siddipet : ఇల్లు.. రాలేదని పెట్రోల్ డబ్బాతో తహసీల్దారు కార్యాలయంలో టిఆర్ఎస్ మహిళా హల్చల్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Siddipet : న్యాయం చేయాలని తహసిల్‌దార్ కార్యాలయం బైఠాయించిన టిఆర్ఎస్ మహిళా నేత అభివృద్ధి పేర స్థానిక ప్రజా ప్రతినిధులు గూడును కూల్చి వేశారని రోదన.. టిఆర్ఎస్ పార్టీ  లో ఉండి 15 ఏండ్లు నష్టపోయానని వేల్లడి ఇల్లు కావాలని కాళ్లు మొక్కిన ప్రజా ప్రతినిధులు కనికరించడంలేదని ఆవేదన..పార్టీకి పనిచేశాను...ఇల్లు కావాలని డిమాండ్..

ఇంకా చదవండి ...
    (News 18 ప్రతినిధి కె.వీరన్నమెదక్ జిల్లా )

    సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది ఉదయం  కార్యాలయాన్ని శుభ్రం చేయడానికి తలుపులు తెరిచి లోనికి వెళ్ళారు. ఇంతలో ఒక మహిళా పెట్రోల్ డబ్బాతో తహసిల్దార్ కార్యాలయంలోని నాయిభ్ తహసిల్దార్ గదిలో వెళ్ళి తలుపులు గడియబిగుంచుకోని స్వీయ నిర్భందం చేసుకుంది. ఇంతలోనే సమాచారం తెలుసుకున్న వీఆర్వో హుటాహుటిన కార్యాలయానికి చేరుకొని తలుపులు గడియను తొలగించి మహిళ చేతిలోంచి పెట్రోల్ డబ్బాను లాక్కున్నాడు. డబుల్ ఇల్లు రాలేదని మనస్థాపంతో టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షురాలు ఇరుమల్ల సుగుణ తన ఆవేదన వ్యక్తం చేసింది.

    ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్థానిక ఎంపీపీ లింగాల నిర్మల భర్త లింగాల లక్ష్మణ్ డబుల్ ఇళ్లును కేటాయిస్తామని హామీ మేరకే మండల కేంద్రంలోని రోడ్ల విస్తరణ  కార్యక్రమానికి తన ఇల్లు కూల్చి వేసి శ్రీకారం చుట్టానని.....గత 15 ఏండ్ల క్రితం ప్రస్తుత రాష్ట్ర  ఆర్థిక . వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో  చేరానని.. నాటి నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరి తీవ్రంగా నష్టపోయానని నాడు మాయమాటలు చెప్పి నా ఇల్లును కూల్చివేసి నేడు అనర్హులకు పైరవీలు చేసే వారికీ ఇండ్లు కేటాయించి నేడు నాకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

    Karimnagar : మంత్రాలు ఉన్నాయా..? ఎందుకు చంపుతున్నారు.. మంత్రాల పేరుతో... ఎన్ని హత్యలు జరిగాయో తెలుసా..?

    కుటుంబ  పరిస్థితుల దృష్ట్యా అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని డబుల్ బెడ్ ఇల్లు కేటాయించాలని పలుమార్లు స్థానిక మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్,స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించి కాళ్లు మొక్కిన ఎవ్వరు  కనికరించడంలేదని.. టిఆర్ఎస్ పార్టీకి నా శక్తిమేర పని చేశానని కానీ పార్టీ నాయకత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగం అడగడం లేదు.. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ప్రజా ప్రతినిధులు ఇచ్చిన నా హామీ మేరకు మాత్రమే  ఇల్లు కావాలని ప్రాధేయ పడుతున్నానని అన్నారు..

    Karimnagar : మంత్రాలు ఉన్నాయా..? ఎందుకు చంపుతున్నారు.. మంత్రాల పేరుతో... ఎన్ని హత్యలు జరిగాయో తెలుసా..?

    ఈ సంఘటన పై తహసిల్దార్ విజయ ప్రకాష్ రావును వివరణ కోరగా 48 డబుల్ ఇండ్లకు సుమారు 1400 మంది దరఖాస్తులు చేసుకున్నారని. సిద్దిపేట జిల్లా పాలనాధికారి,ఆర్డీవో అధికారులు,ఆదేశాల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక పై అధికారులకు అందజేస్తాం. వారి  ఆదేశాల మేరకు తగిన చర్యలు చేపడతామని తాహసిల్దార్ తెలియజేశారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Siddipeta, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు