WOMAN ALIVE WITH DEADBODY OF HER YOUNGER SISTER FOR FOUR DAYS IN PEDDAPALLY VRY KNR
Peddapally : చెల్లెలు చనిపోయి నాలుగు రోజులు గడిచినా.. బయటికి చెప్పని అక్క.. దుర్వాసనతో ఇంట్లోనే..! కారణం ఇదేనా...?
ప్రతీకాత్మకచిత్రం
Peddapally : తన సొంత చెల్లెలు శవంతో నాలుగు రోజుల పాటు ఇంట్లోనే సహావాసం చేసింది ఓ అక్క . చనిపోయి నాలుగు రోజులు అయినా బయటకు తెలియకుండా మెయింటెన్ చేసింది.
సొంత చెల్లెలు చనిపోతే కనీసం బయటకు చెప్పలేదు.. పైగా నాలుగు రోజులుగా శవంతోనే ఇంట్లో ఉంటుంది.. చివరకు ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గమనించడంతో అసలు విషయం బయటపడింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పెద్దపల్లి పట్టణంలోని ప్రగతి నగర్ లో జీవిస్తున్న మారోజు శ్వేత(24) నాలుగు రోజుల క్రితం అనుమాదస్పద స్థితిలో మృతి చెందింది. అయితే తన చెల్లెలు మృతిచెందిన విషయం బయటకు చెప్పకుండా శ్వేత సోదరి స్వాతి దాచి పెట్టింది. ఇలా చనిపోయిన నాలుగు రోజులుగా ఎవ్వరికి చెప్పలేదు.. పైగా ఆ శవంతోనే ఇంట్లోనే ఉంటూ తన పని తాను చేసుకుపోతుంది..
అయితే ఆమె ఇంట్లోనుండి సోమవారం తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. శ్వేత ఎలా మృతి చెందిందనే విషయం పై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు చెల్లెలు చనిపోయినా... నాలుగు రోజులుగా ఎందుకు చెప్పకుండా ఉందనే అంశంపై కూడా పోలీసులు అరా తీస్తున్నారు.. కాగా ఇలాంటీ సంఘటలు గతంలో కూడా అనేకం చోటు చేసుకున్నాయి.. కొంతమంది మతిస్థిమితం లేక ఇలాంటీ సంఘటనలకు పాల్పడితే మరికొంత మంది మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తించారో తెలియని పరిస్థితిని పోలీసులు గుర్తించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.