Home /News /telangana /

WITHOUT VOTER MLC CAMPAIGN GOING ON IN KARIMNAGAR VRY

Karimnagar : ఓటర్లు లేకుండానే ఎన్నికల ప్రచారం.. స్థానికంలో అభ్యర్థుల అయోమయం

Karimnagar, MLC elctions

Karimnagar, MLC elctions

Karimnagar : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఓ వింతగా కొనసాగుతోంది. ( mlc campaign in Karimnagar ) ఓట్లు వేసే ఓటర్లు క్యాంపులకు వెళ్లడంతో పోటి చేస్తున్న అభ్యర్థులు ,ఆయా పార్టీల నాయకులను ప్రసన్నం చేసుకోవడతో పాటు మీడియా ద్వారానే ప్రచారం చేస్తున్న పరిస్థితి నెలకొంది.

ఇంకా చదవండి ...
  కరీంనగర్ జిల్లా..న్యూస్ 18తెలుగు. కరస్పాండెంట్. శ్రీనివాస్. పి.

  కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అనూహ్యమైన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆ జిల్లాలో అధికారపార్టీకి పోటి చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థుల ప్రచారం అనుకున్నంత స్థాయిలో కొనసాగడం లేదు. క్రమంగా బలహీన పడుతోంది . ( mlc campaign in Karimnagar ) డిసెంబరు 10 న జరిగే ఎన్నికలకు ఇంకా ఎనిమిది రోజులు సమయం ఉండటం మరోవైపు స్థానికంగా ఓటర్లు ఎవరూ అందుబాటులో లేకపోవ డంతో అభ్యర్థులు నిరుత్సాహ పడుతున్నారు . స్థానికంగా మారిన రాజీకీయాల నేపథ్యలోనే అక్కడి ఓటర్లను ఆయా పార్టీలు తమ క్యాంపు కార్యాలయాలకు పంపించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అధికార పార్టీ సభ్యులతో పాటు 10 మంది పోటిలో ఉన్నారు. ( mlc campaign in Karimnagar ) వీరిలో ఎల్ . రమణ , భానుప్రసాద్‌రావు పోటీ చేస్తున్నారు . మిగిలిన వారంతా ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు.

  ఉమ్మడి జిల్లాలో చెందిన 1,324 ఓట్లలో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 1,000 ఓట్ల వరకు బలం ఉంది . అయితే అధికార పార్టీ బలంతో అతి సులువుగా గెలిచే అవకాశాలు ఉన్నా... రెబల్ అభ్యర్థుల నామినేషన్స్‌తో ఆ పార్టీ ముందుగానే అలర్ట్ అయింది.( mlc campaign in Karimnagar ) నామినేషన్ ప్రక్రియ తర్వాత తమ సభ్యులను క్యాంపులకు తరలించింది. ముందుగా వారం రోజుల పాటు అనుకున్నా అది కాస్తా ఎన్నికల తేదీ వరకు కొనసాగించే ఏర్పాట్లను అధికార పార్టీ నేతలు చేశారు.


  Telangana corona : మరోసారి కరోనా నిబంధనలు.. మాస్క్ లేనివారికి 1000 జరిమాన


  అయితే తమకు సొంత పార్టీ సభ్యుల లేకపోయినా.. ముఖ్యంగా రేబల్ అభ్యర్థిగా వేసిన సర్ధార్ రవీందర్ సింగ్ తో పాటు ఇతర నేతలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారు , ఉద్యమకారులు తమకు ఓటు వేస్తారనే యోచనలో ఉన్నారు. ఇలా బరిలోకి దిగారు. ( mlc campaign in Karimnagar ) అధికార పార్టీ సభ్యులు లేకున్నా తమ ప్రచారన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండిపెండెట్లపై ఓట్లనున సాధించవచ్చే వ్యూహంతో ముందుకు సాగారు. అయితే వారి ఆశలకు కాంగ్రెస్ పార్టీ సైతం గండికొట్టింది. హుజూరాబాద్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి తమ వ్యుహాన్ని మార్చారు. తమ సభ్యులు ఇతర పార్టీల నేతల ప్రలోభాలకు తలొగ్గకుండా ప్లాన్ వేశారు.

  దీంతో ఉమ్మడి జిల్లాలో ఉన్న దాదాపు 200 మంది కాంగ్రెస్ నేతలు కూడా హైదరాబాద్ బాటపట్టారు . ఇలా తాము ఓట్లు అడుగుదామనుకున్న కాంగ్రెస్ సభ్యులు కూడా క్యాంపులకు వెళ్లడంతో..బరిలో ఉన్న నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు . ( mlc campaign in Karimnagar ) అధికార పక్షం నేతలు బెంగళూరులో .. ప్రతిపక్ష మేమో హైదరాబాద్‌లో ఉండడంతో.. తమ ప్రచారానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడడంతో పాటు , అప్పుడప్పుడు మీడియా ముందు ప్రెస్ మీట్లు పెట్టి ఓటర్లకు విజ్ఝప్తి చేస్తున్నారు.


  Karimnagar : అక్రమ సంబంధం అంటగట్టిన మామపై దారుణం.. అర్థరాత్రి మరో యువకుడితో కలిసి..


  సో దీంతో బరిలో నిలుచున్న అభ్యర్ధులు కనీసం ఓటర్లను కలవనీయకుండా క్యాంపులు ఏర్పాటు చేయడంతో కనీసం అభ్యర్థించే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో ఇలాంటీ పరిస్థితి గతంలో ఎప్పుడు లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ( mlc campaign in Karimnagar ) తమకు ఓటర్లను కలిసే అవకాశం లేకపోయినా.. మీడియా ప్రచారమే తమకు శ్రీరామ రక్ష అంటూ అభ్యర్థులు చెబుతుండడం గమనార్హం. అయితే కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గోంటారా .. ఒకవేళ పాల్గోంటే ఎవరికి ఓటు వేస్తారనే ఉత్కంఠకు మాత్రం ఎన్నికల తేదీ తర్వాతనే తెరపడనుంది. ( mlc campaign in Karimnagar ) మరోవైపు టీఆర్ఎస్‌లో కూడా అసంతృప్తులు ఉండడం కూడా ఇండిపెండెంట్లకు కలిసి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Karimnagar, Mlc elections

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు