నిజాయితీ కూరగాయలు.. మనుషులు ఉండరు.. డబ్బులు తీసుకోరు..

రైతు ఏర్పాటు చేసిన బోర్డు

మనుష్యులే లేకుండా వ్యాపారం..తనకు ఉన్నదాంట్లో ప్రజలకు చేయూతను ఇస్తున్నాడు ఓ రైతు..నమ్మకంపై కూరగాయలు పెట్టి డబ్బులను డబ్బాలో వేసే విధంగా ప్లాన్ చేసి ప్రజల్లో నిజాయితీ ఇంకా మిగిలి ఉందని నిరూపించాడు ఓ రైతు .

  • Share this:
జగిత్యాల జిల్లా
న్యూస్ 18తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్. పొన్నం.

చేసేది వ్యాపారమే.. కాని యజమాని ఉండడు . .అందరికి అందుబాటులో వినియోగదారులకు  కావల్సినవి ఉంటాయి.. కాని వాటివద్ద కౌంటర్ ఉండదు.. డబ్బులు తీసుకునేందుకు మనిషి కూడ ఉండడు..ఎవరి ఇష్టం వచ్చిన వాటిని వారు తీసుకుంటారు... ఇదేట్లా సాధ్యం అనుకుంటున్నారా.. ఇది సాధ్యమే ప్రాచీన కాలంలో ఇలాంటీ వ్యాపారాలు ఉన్నప్పటికే తిరిగి ఇప్పుడు కూడ సాధ్యమేనని నిరూపిస్తున్నాడు ఓ రైతు..ఇక్కడ ఓ ట్విస్ట్ కూడ ఉంది..ఆయన చేసే వ్యాపార సముదాయానికి "నిజాయితి" అని పేరు కూడ పెట్టాడు..

ప్రస్తుత రోజుల్లో మనిషి, మనిషిని నమ్మడమే చాల కష్టం. అలాంటిది ఓ వ్యాపారం చేస్తే అన్ని చూసుకునే వ్యాపారం చేస్తారు. కాని  ఇక్కడ ఓ రైతు మాత్రం నమ్మకం, నిజాయితే పెట్టుబడిగా ప్రజలకు కావాల్సిన కూరగాయలను అందిస్తున్నాడు. దీంతో దేశానికి అన్నం పెట్టేది రైతు అనే నానుడిని నిజం చేస్తున్నాడు. తాను పండించిన కూరగాయలను తానే స్యయంగా ఓ దుకాణం పెట్టి ప్రజలకు అందిస్తున్నాడు. అదికూడ డబ్బులు డిమాండ్ లేకుండా ..కేవలం ఓ బోర్డు రాసి పెట్టి అక్కడ ఒక మనిషి కూడ లేకుండా కూరగాయాలు అమ్మి అందరిని అశ్చర్యానికి గురి చేస్తున్న రైతుపై న్యూస్ 18 స్పెషల్ స్టోరీ..

డిజిటల్ మనీ చెల్లిస్తున్న వినియోగదారుడు


వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌ రైతు మల్లారెడ్డి అనే రైతు కూరగాయలు, పండ్లతోట పెంపకం చేస్తున్నాడు.. ఈ మధ్యకాలంలో కూరగాయల ధరలు పడిపోవడం.. మార్కెట్‌కు తీసుకెళితే..సరైన ధరలు లభించపోవడతో పాటు మధ్య దళారుల దోపిడి తెలిసిందే.....దీంతో విసుగు చెందిన మల్లారెడ్డి ఆయన తోట సమీపంలోనే జగిత్యాల-గొల్లపల్లి రహదారిలో నిజాయితీ అనే పేరుతో ఓ దుకాణం ఏర్పాటు చేశాడు. అందులో తాను పండించిన కూరగాయలను పెడతాడు. అనంతరం కూరగాయలకు సంభంధించి వాటి రేట్లను బోర్డుపై రాసి పెడతాడు. కాని మల్లారెడ్డి మాత్రం తన వ్యవసాయం చేసుకోవాడానికి వెళ్లిపోతాడు.

variety business
తన దుకాణం వద్ద కూరగాయల రేట్లు


దీంతో కూరగాయలు కావాలనుకునే వినియోగదారులు దుకాణం దగ్గర ఆగి కూరగాయలు వాళ్లే స్యంతగా తీసుకుంటారు. కాగా డబ్బులు వేయడానికి మాత్రం ఓ ప్లాస్టిక్ బాక్స్ ను ఏర్పాటు చేశాడు. కూరగాయాలు తీసుకున్నవారు అక్కడున్న రేట్ల ప్రకారం అందులో డబ్బులు వేసి వెళతారు...ప్రస్థుతం డిజిటల్ మనీ పెరిగిన సంధర్బంలో డబ్బులు లేని వాళ్లు డిజిటన్ రూపలో ఇచ్చే ఏర్పాటు కూడ చేశారు. దీంతో చిల్లర డబ్బులు లేని వాళ్లు ఫోన్ పే లేదా ఇతర మార్గాల్లో డబ్బులు పంపిస్తారు.

variety business
నిజాయితీ వ్యాపారం చేసే రైతు మల్లారెడ్డి


ఇలా రోజు 200 నుంచి 500  రూపాయల వరకు సంపాదిస్తున్నానని రైతు వివరించారు.. అయితే  ఎందుకు ఉండడం లేదనే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చాడు..రోజు దుకాణంలో ఓ వ్యక్తి కూర్చుంటే అతనికి కూలీ గిట్టుబాటు కాదని , ఇలా ఏర్పాటు చేశానని చెబుతున్నాడు.. నిజాయితీగా ఏర్పాటు చేసిన ఈ దుకాణంలో రైతుకు నిజాయితీగానే వినియోగాదారులు  డబ్బులు వేసి సరుకులు తీసుకుని వెళుతున్నారని వివరించాడు.. ఇలా ఉదయం కూరగాయాలు ఉంచి వెళ్లి, తోట పనులు చేసుకుంటాడు.. మళ్లీ సాయంత్రం తిరిగి వచ్చి నగదు తీసుకుని వెళతాడు..కాగా రాత్రి సైతం సరుకులు అక్కడే ఉంచి వెళుతుండడం గమనార్హం.

.ఈ విదంగా చేయడం చాల సంతోషంగా ఉందని ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదని, అందరూ వినియోగదారులు కూడా సహకరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు మల్లారెడ్డి.. కాగా గతంలో మల్లారెడ్డి ఓ ప్రైవేట్ స్కూల్స్ కి కరస్పాండెంట్ గా పనిచేసాడు. కానీ గత ఏడాది నుండి కరోనా ఉన్న నేపథ్యంలో స్కూల్స్ అన్ని ఆన్‌లైన్ క్లాసులు అయ్యాయి. దీంతో తనకున్న కొద్దీ పాటి వ్యవసాయ భూమిలో సేంద్రియ ఎరువుల ద్వారా కూరగాయలు, పండ్లు పండించి ఇలా అమ్ముతున్నానని రైతు మల్లారెడ్డి తెలిపాడు.
Published by:yveerash yveerash
First published: