హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad :గంటలో మూడున్నర లక్షలు మొక్కలు...గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్న ఆదిలాబాద్

Adilabad :గంటలో మూడున్నర లక్షలు మొక్కలు...గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్న ఆదిలాబాద్

Adilabad :గంటలో మూడున్నర లక్షలు మొక్కలు..

Adilabad :గంటలో మూడున్నర లక్షలు మొక్కలు..

Adilabad : మొక్కలు నాటటడంలో తెలంగాణ సరికొత్త రికార్డ్‌ను సృష్టించబోతుంది.. గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త రికార్డ్‌ను అందుకోబోతుంది. అదికూడా మారుమూల అటవీ ప్రాంత జిల్లా అయినా ఆదిలాబాద్ జిల్లా ఈ రికార్డ్‌ను స్వంతం చేసుకోనుంది.

ఇంకా చదవండి ...

  మాజి మంత్రి ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టిన రోజు సంధర్బంగా ఒకేరోజు పదిలక్షల మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే నేడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త ఎంపీ సంతోష్ కుమార్‌లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

  తన పుట్టిన రోజున పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జోగు రామన్న..గత సంవత్సరం కంటే ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటించి  ప్రపంచ రికార్డ్‌కు చేరువలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన 58వ పుట్టిన రోజు సంధర్బంగా రెండు అంబులెన్స్ లను ఎంపీ సంతోష్ చేతుల మీదుగా రిమ్స్ హాస్పిటల్ కు అందించారు.


  అదిలాబాద్ రూరల్‌లోని దుర్గానగర్ అటవీ ప్రాంతంలోని సుమారు 200 ఎకరాల్లో యాదాద్రి మోడల్‌లో ఒక గంట వ్యవధిలోనే ఐదు లక్షల మొక్కలు నాటారు. ఇక అదిలాబాద్ రూరల్ బేల మండలంలో రెండు లక్షల మొక్కలు, అర్బన్ లో 45 వేల నివాసాల పరిధిలో ఒక లక్షా ఎనభై వేల మొక్కలు, జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరవైపులా ఒక లక్షా ఇరవై వేల మొక్కలు గంట వ్యవధిలోనే నాటారు. మొత్తం పది సెక్టర్లుగా విభజించిన ప్రదేశాల్లో సుమారు 30 వేల మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు తోడు, పెద్ద సంఖ్య లో పాల్గొన్న అదిలాబాద్ వాసులు మొక్కలను నాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

  అయితే టర్కీలో గ్రీన్ ప్లాంటేషన్‌లో భాగంగా గంటలో మొత్తం మూడు లక్షల మూడు వేల మొక్కలను నాటిన  వరల్డ్ రికార్డ్ ఉంది. ఈ క్రమంలోనే ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు జోగు రామన్న ఒక గంటలో మూడున్నర లక్షల మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీసి గిన్నీస్ బుక్ రికార్డ్‌ కోసం పంపనున్నారు. సో మొత్తం మీద ఒక గంటలో అన్ని లక్షల మంది ఒకేసారి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావడం పలువురి ప్రశంసలు అందుకోంటుంది.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Adilabad

  ఉత్తమ కథలు