హోమ్ /వార్తలు /తెలంగాణ /

Farmers: వాటిని సాగు చేస్తూ.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతులు.. వాళ్ల సంపాదన ఎంతో తెలుసా..

Farmers: వాటిని సాగు చేస్తూ.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతులు.. వాళ్ల సంపాదన ఎంతో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Farmers: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యాసంగి వరి ధాన్యం కోనుగోలు చేయమని అంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వానికి  ధీటుగా ఆ గ్రామస్తులు ఏకమయ్యారు. ఆకు కూరగాయలు పండిస్తూ రైతులు ఆదాయాన్ని సంపాదిస్తూ జిల్లా లోనే  ఆ గ్రామాన్ని ఆదర్శంగా నిలపెడుతున్నారు.

ఇంకా చదవండి ...

(K.Veeranna,News18,Medak)

తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యాసంగి వరి ధాన్యం కోనుగోలు చేయమని అంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వానికి  ధీటుగా ఆ గ్రామస్తులు ఏకమయ్యారు. ఆకు కూరగాయలు పండిస్తూ రైతులు ఆదాయాన్ని సంపాదిస్తూ జిల్లా లోనే  ఆ గ్రామాన్ని(Village) ఆదర్శంగా నిలపెడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నారయణఖేడ్ పట్టణానికి అమడ దురంలో ఉన్న చంద్ఖాన్పల్లి గ్రామంలో రైతులు ఆకు కూరగాయలు పండిస్తూ అధిక ఆదాయం సంపాదిస్తున్నారు. చంద్ఖాన్పల్లి గ్రామంలో 300 కుటుంబాలు ఉండగా 2,100 మంది జనాభా ఉన్నారు. వీరు వ్యవసాయం పై ఆధారపడి 70 శాతం మందికి పైగా జీవిస్తున్నారు. 250 కుటుంబాలకు భూమి 700 ఎకరాల్లో 500 వరకు బోర్లు ఉన్నాయి.

Read Also: Stone Was Found: అతడికి ఓ రాయి దొరికింది.. అదే అతడి జీవితాన్ని మార్చేసింది.. ఇంతకు ఏంటి దీని ప్రత్యేకత అంటే..


30మంది రైతులు డ్రిప్ ద్వారా పంట సాగు చేస్తున్నారు. రైతులకు ప్రధాన వృత్తి కూరగాయల సాగు కావడంతో కుటుంబ సభ్యులంతా వ్యవసాయ పనులు చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ తో 30 మంది రైతులు డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు గ్రామంలో పర్యటిస్తూ రైతులకు పలు సూచనలు ఇస్తూ అధిక ఆదాయాన్ని సాధించే విధంగా సలహాలు ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సాగయ్యే పంటల్లో చాంద్ ఖాన్పల్లి  రైతులదే హవా నడుస్తోంది. ఈ గ్రామంలో పండించే ఆకు కూరగాయలు స్థానిక మార్కెట్ తో పాటు హైదరాబాద్ వంటి మహానగరంలో మంచి డిమాండ్ ఉంది.

Read Also: భారతీయ సంగీతానికి ఎంత ఆదరణ ఉందో.. వీళ్లను చూస్తే మీకే అర్థం అవుతుంది.. వీడియో వైరల్..


నారాయణఖేడ్ మండలలో కొన్ని  గ్రామాల్లో ఆకు కూరగాయలపై ఎక్కువగా మోజు చూపుతున్నారు. ఆకు కూరగాయల తో పాటు వంకాయ, చిక్కుడుకాయ తో మంచి లాభాలు ఉంటాయి అని అక్కడి రైతులు అంటున్నారు. వాటిని విక్రయించి ప్రతి రోజు రూ. 1000 నుండి 1500 వందల వరకు సంపదిస్తున్నారు. వరి ధాన్యం అమ్మితే వచ్చే సంపాదన కంటే.. కూరగాయలు సాగుచేసి అమ్మితే వచ్చే సంపాదనే అధికంగా ఉందని అక్కడి రైతులు అంటున్నారు. ఇక అక్కడి రైతులు అందరూ ఒకే త్రాటిపైకి వచ్చి ఆకు కూరగాయలతో పాటు వంకాయ, చిక్కుడుకాయ, ఉల్లిగడ్డ వంటివి సాగు చేస్తున్నారు. వీటి ద్వారానే ఎక్కువగా లాభాలు వస్తున్నాయంటూ చెబుతున్నారు.

Read Also:  Ambulance Service: అతడు అంబులెన్స్ లను ఎలా ఉపయోగించాడో చూడండి.. వామ్మో.. ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా..


ఎవరిపై ఆధారపడకుండా తన భూమిలో తనకు ఇష్టమైన పంట వేసుకుంటే ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి పంటలు వేస్తే ప్రభుత్వం చెప్పే దాకా వేచి చూడాల్సి వస్తుందని.. అప్పటి వరకు ఇంట్లో జీవనాధారాన్ని కోల్పోతున్నామని అంటున్నారు. ఇక అక్కడ ఆకుకూరలు పండించే లక్ష్మణ్ అనే రైతు మాట్లాడుతూ.. ఆకు కూరగాయలతో అధిక లాభాలు ఉంటాయన్నారు. నారాయణఖేడ్ తో పాటు హైదరాబాద్ లో కూడా అమ్ముతామని చెప్పాడు. ఎవరిపై ఆధారపడకుండా ఇలాంటి పంటను వేసుకుని రైతే రాజు అనే నినాదంతో ముందుకు సాగొచ్చని నర్సింలు అనే రైతు అన్నారు.

First published:

Tags: Farmers, Telangana

ఉత్తమ కథలు