• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • WITH IN HOURS WIFE AND HUSBAND DEATH DUE TO CORONA IN PEDDAPALLY VRY KNR

Peddapally : కరోనాతో... గంటల వ్యవధిలోనే భార్యభర్తలు మృతి.. అనాథలుగా మారిన పిల్లలు

కరోనాతో... కొద్దిగంటల్లోనే భార్యభర్తలు మృతి..అనాథలుగా పిల్లలు

Peddapally : కరోనా ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం గంటల వ్యవధిలో భార్య , భర్తలిద్దరు, మృతి చెందారు. వారంపాటు ఐసోలేషన్‌లో ఉండగా బుధవారం రాత్రి భర్త, ఉదయం భార్య చనిపోయారు. దీంతో చిన్నపిల్లలు అనాథాలుగా మిగిలారు. ఒకేసారి తల్లిదండ్రులను కోల్పోవడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.

  • Share this:
పెద్దపల్లి జిల్లా.
తేదీ.
న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్. పి.

కరోనా అనేక కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది. కరోనా భారినపడి కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు చనిపోతున్న దృశ్యాలు హృదయవిదారకంగా మారుతున్నాయి...ముఖ్యంగా ఒకే ఇంట్లో భార్యభర్తలు, అన్న చెల్లెల్లు, తల్లి కొడుకు , ఇలా చాల మంది కరోనా భారిన పడి కొద్ది రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది..ముఖ్యంగా కరోనాతో ముప్పై నుండి నలబై సంవత్సరాల లోపు వారు కూడ కరోనా కాటుకు బలికావడం అంత్యంత దారుణంగా మారాయి. దీంతో వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు.

తాజాగా ఇలాంటీ ఈ హృదయవిదాకర ఉదంతం రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో చోటు చేసుకుంది.పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ లో కుడికాల మల్లేశ్ , సృజన దంపతులు మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు . ఇటీవల వీరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా హోం ఐసొలేషన్లో ఉండి వారం రోజులు మందులు వాడారు . అయినా తగ్గకపోవడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ అస్పత్రిలో చేరారు . చికిత్స పొందుతున్న మల్లేశ్ ( 38 ) బుధవారం రాత్రి మృతి చెందగా .. గురువారం తెల్లవారుజామున సృజన ( 32 ) చనిపోయారు వీరికి. 10 , 8 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.. తల్లిదండ్రుల మృతితో అనాథలుగా మిగిలారు. తల్లి తండ్రులు ఒకేసారి మృతి చెందడం తో ఇద్దరు కుమారులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం స్పందించి. ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తల్లి తండ్రులను కోల్పోయిన చిన్నారులను చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
Published by:yveerash yveerash
First published: