corona effect : కరోనా మాయ - తిండి లేక ఆకులు తింటున్న శునకాలు

corona effect : కరోనా మాయ - తిండి లేక ఆకులు తింటున్న శునకాలు

తిండి లేక ఆకులు తింటున్న శునకాలు

corona effect : కరోనాతో మనుషులు అన్ని బంద్ పెట్టి లాక్డౌన్‌లో కొనసాగుతుంటే..రో్డ్డుపై జీవిస్తున్న మూగ జీవాల పరిస్థితి ఏంటీ..అందుకే అవి సృష్టి ధర్మానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నాయి..బోక్కలకు బదులు చెట్ల ఆకులను తింటూ కనిపిస్తున్నాయి.

  • Share this:


కరోనా మనుషులకే కాదు పశువులు జంతువులకు కూడా కష్టాలను తెచ్చిపెడుతోంది. అన్ని బంద్ పెట్టి లాక్డౌన్ పెట్టినా కరోనా సమయంలో మనుషులను ఎవరో ఒకరు ఆదుకుంటరు. కాని రోడ్డుపై ఉన్న పశువులను ఎవరు ఆదుకుంటరు..అందుకే అవి కూడ కాలానికి అనుగుణంగా మారాయి..తమకు రోజు ఎక్కడో ఓ చోట ఫుడ్ పెట్టే వారు కరువయినప్పుడు సృష్టికి విరుద్దంగా అయినా సరే అందుబాటులో ఉన్న వాటిని తిని బతుకుతున్నాయి మూగ జీవాలు, సాధారణంగా రోడ్డుపై ఉండే కుక్కలు ఇళ్లలో వేసే పాచి అన్నం లేదంటే వండిపారేసిన ఆహార పదార్థాలు, ఇంకా లేదంటే చెత్తకుప్పల్లో ఉండే ఆహారాన్ని తింటాయి...

కాని కరోనాతో రోడ్డుమీద ఉండే మూగజీవాల జీవన విధానం కూడ మారినట్టు గ్రామ సింహాలుగా పేరున్న శునకాలు తినడానికి కూడా మాంసం ముక్కలు, బొక్కలు కరువై చెట్ల ఆకులతో సరిపెట్టుకునే పరిస్థితికి వచ్చాయి. బొక్కలంటే లొట్టలేసుకుని తినే ఓ శునకం చెట్ల ఆకులు తిని కడుపు నింపుకుంటున్న దృశ్యం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో కనిపించింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో బెంబెలెత్తిపోయిన ప్రజలు గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలో స్వీయ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో మండలం కేంద్రం చికెన్ దుకాణాలు, హొటళ్ళు మూసి ఉంచుతున్నారు. జన సంచారం లేదు. దీంతో వీధి కుక్కలకు తినడానికి కూడా ఏమి దొరకడం లేదు. దీంతో చెట్ల ఆకులు తిని   కలిని తీర్చుకుంటున్నాయి. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా కరోనా కష్టకాలం తొలిగిపోయి త్వరలోనే మంచిరోజులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Published by:yveerash yveerash
First published: