హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణలో మందుబాబుల రికార్డ్.. ప్రభుత్వానికి కాసుల పంట

తెలంగాణలో మందుబాబుల రికార్డ్.. ప్రభుత్వానికి కాసుల పంట

    తెలంగాణలో బుధవారం మద్యం దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. 45 రోజుల తర్వాత షెట్టర్లు తెరచుకోవడంతో మందు బాబులు ఎగబడ్డారు. బీర్లు, లిక్కర్ కోసం అంతటా భారీ క్యూలైన్లు కనిపించాయి. మండుటెండల్లో గంటల తరబడి నిలబడి బాటిళ్లు కొనుగోలు చేశారు మద్యం బాబులు. సాయంత్రం 6 తర్వాత షాపులన్నీ మూతపడ్డాయి. ఐతే తొలి రోజు అమ్మకాలు ముగియడంతో ఎంత మేర అమ్మకాలు జరిగాయన్న దానిపై లెక్కలు బయటకొచ్చాయి. బుధవారం రికార్డు స్థాయిలో రూ.90 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు చెప్పారు. మార్చి 21 నాటికి మద్యం దుకాణాల్లో రూ.110 కోట్ల స్టాక్ ఉండగా.. ఇవాళ్టి అమ్మకాల తర్వాత రూ.20 కోట్ల స్టాక్ మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఒక్క రోజే రూ.90 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.

    ఐతే లాక్‌డౌన్ సమయంలో మద్యం వ్యాపారులు అక్రమాలకు పాల్పడ్డారన్నట్లు ఇప్పటికే విమర్శలున్నాయి. బ్లాక్‌లో మూడింతలు ఎక్కువ ధరకు స్టాక్ అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్టాక్ ఆధారంగా అసలు అమ్మకాల లెక్కలు ఎంతో తెలియడం అంచనా వేయడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా, తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. కంటైన్‌మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో అనుమతిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ ఉంటాయి. ఇక చీప్ లిక్కర్‌పై 11శాతం ధరలను పెంచిన సర్కార్.. ఇతర మద్యంపై 16శాతం పెంచింది.

    First published:

    Tags: Andhra Pradesh, AP News, Liquor sales, Liquor shops, Wine shops

    ఉత్తమ కథలు