హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalogonda : మద్యంషాపు యజమాని అప్పుల తిప్పలు.. వసూళ్లకు ఓ వినూత్న ఐడియా..!

Nalogonda : మద్యంషాపు యజమాని అప్పుల తిప్పలు.. వసూళ్లకు ఓ వినూత్న ఐడియా..!

new idea

new idea

Nalogonda : మద్యం వ్యాపారంలో అప్పులు ఇవ్వడం చాలా రేర్.. కాని ఓ మద్యం షాపు యజమాని ఇలా అప్పులు ఇచ్చి తిప్పలు పడుతున్నాడు.. ( New Idea for collecting borrow money )చివరకు అప్పులు వసూలు చేసుకునేందుకు ఓ వినూత్న ఐడియాకు రతీశాడు.

    వ్యాపారంలో వినియోగదారులకు ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోవడానికి అనేక మార్గాలు కొంతమంది వ్యక్తిగత జులుం చేసి వసూలు చేసుకుంటే.. ఇంకా కొంతమంది మాత్రం చట్టపరంగా వెళ్లి వసూలు చేసుకుంటారు. ఇంకా లేదంటే అప్పు ఇచ్చిన వారితో సఖ్యతగా మెదిలి తాము పెట్టిన అప్పును వసూలు చేసుకుంటారు.( New Idea for collecting borrow money ) ఇలా అప్పులు వసూలు చేసుకునే పరిస్థితులు ఆయా వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది.అయితే ఇక్కడ మాత్రం ఓ మద్యం వ్యాపారీ తన అప్పులు వసూలు చేసుకునేందుకు ఓ వ్యా వ్యాపారీ వినూత్నంగా ఆలోచించారు. తాను పెట్టిన వ్యాపారం క్లోజ్ అవుతున్న తరుణంలో ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వని వారికి ఆ వ్యాపారి పెద్ద షాక్ ఇచ్చాడు. ఇందుకోసం వినియోగదారుల బలహీనతలను ఆసరా చేసుకుని ఒక రకంగా సుతిమెత్తగా  బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డాడు. ( New Idea for collecting borrow money )ఇంతకి ఆయన చేసిన పనేమేటి.. వ్యాపారమేమిటి ఎక్కడ జరిగింది తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే...

    ఇటివల కొత్త మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే.. దీంతో వేలాది మంది పోటి పడి మరోసారి షాపులను దక్కించుకునేందుకు క్యూలో నిలుచున్న పరస్థితి కనిపించింది. ఇది ఇలా ఉంటే.. గత సంవత్సరం టెండర్లలో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారులకు మద్యం అమ్మకాలకు అనుమతి రేపటితో ముగియనుంది. ( New Idea for collecting borrow money )అయితే ఇక్కడే చిక్కంతా వచ్చి పడింది. రెండు సంవత్సరాలు వ్యాపారం నిర్వహించిన వారు కొంతమంది తిరిగి టెండర్లు దక్కించుకోగా చాలా మందికి తిరిగి టెండర్లు దక్కని పరిస్థితి నెలకొంది.

    MLC Kavita : అప్పుడు కేటీఆర్‌కు ..ఇప్పుడు కవితకు లేఖలు..


    ఈ క్రమంలోనే గత రెండు సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహించిన ఓ మద్యం వ్యాపారికి ఓ సమస్య వచ్చిపడింది.గత సంవత్సరం యాదాద్రి భువనగిరి జిల్లాల చౌటుప్పల్ మండలంలోని మల్కాపురంలో ఒకరికి టెండర్ దక్కడంతో వైన్ షాప్ నిర్వహిస్తున్నాడు.( New Idea for collecting borrow money ) సాధారణంగా మద్యం షాపుల్లో క్రెడిట్ పెట్టే పరిస్థితి కనిపించదు.. అయితే గ్రామీణ ప్రాంతాలు కావడంతో పాటు కొంతమంది తెలిసివారు ఉండడం రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యాపారం కావడంతో పాటు ఉన్న రెండు సంవత్సరాల్లో కరోనాతో వ్యాపారాలన్ని అతలాకుతలం అయిన పరిస్థితి నెలకొంది. దీంతో వ్యాపారంలో అప్పులు పెట్టకుండా నడిచే పరిస్థితి లేకపోవడంతో వినియోగదారులకు అప్పులు పెట్టక తప్పని పరిస్థితి అనివార్యమైంది.

    అయితే ఇలా ఆ వైన్స్ యజమాని సుమారు ఎనిమిది లక్షల మేర మద్యం ప్రియులకు అప్పులు పెట్టాడు. తీరా ఈ సంవత్సరరం టెండర్ రాలేదు.( New Idea for collecting borrow money ) దీంతో తన అప్పులు అప్పులు ఇవ్వాలని కోరినా ఎవరు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు.. దీంతో ఓ వైపు రేపటితో షాపు క్లోజ్ చేయాల్సిన పరస్థితి ..మద్యం షాపు క్లోజ్ చేస్తే ఇచ్చిన అప్పులు తిరిగి రావడం గగనమే.. అవి బూడిద ఖాతాల కింద లెక్క చూసుకోవాల్సిందే..

    అయితే ఆ మద్యం వ్యాపారికి ఓ ఉపాయం చేశాడు. తన మద్యం సేవించేందుకు సాధారణంగా అప్పులు చేసి తాగడం అనేది పరువుకు సంబంధించిన సమస్య.. ఇక పరువుపై దెబ్బ కొడితే అప్పులు తీరుతాయని భావించాడు. ( New Idea for collecting borrow money )దీంతో తనకు అప్పులున్న మద్యం వినియోగదారులు ఈనెల 29 వరకు చెల్లించాలని లేదంటే వారి పేర్లు ఫ్లేక్సీ ద్వారా ప్రజలకు తెలిసేలా రాయిస్తానని హెచ్చరిస్తూ తన మద్యం షాపు ముందు ఓ బ్యానర్ కట్టాడు.

    అయితే ఐడియా బాగానే ఉన్నా ఎంతమంది అప్పులు ఇచ్చారు. బ్యానర్‌లో సూచించిన టైం వరకు ఇస్తారా లేక తమ పేర్లను ప్రజలకు తెలిసేలా బయటపెట్టెవరకు చూస్తారా అనేది చూడాల్సిందే..

    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, Wine shops

    ఉత్తమ కథలు