హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda :అప్పులు ఇలా కూడా వసూలు చేసుకోవచ్చు..! మద్యం వ్యాపారికి వర్కవుట్ అయిన బ్యానర్ ఐడియా.. బాకిలు ఇస్తామంటూ క్యూ

Nalgonda :అప్పులు ఇలా కూడా వసూలు చేసుకోవచ్చు..! మద్యం వ్యాపారికి వర్కవుట్ అయిన బ్యానర్ ఐడియా.. బాకిలు ఇస్తామంటూ క్యూ

banner

banner

Nalogonda : మద్యం వ్యాపారంలో అప్పులు ఇవ్వడం చాలా రేర్.. కాని ఓ మద్యం షాపు యజమాని ఇలా అప్పులు ఇచ్చి, చాలా వెరైటీగా వసూలు చేశాడు. ( New Idea for collecting debt money )మొండి బకాయిలు వసూలు చేసేందుకు ఆయన ఐడియాను అందరు వ్యాపారులు ఫాలో అయితే ఇక వినియోగదారులకు చుక్కలే మరి.

ఇంకా చదవండి ...

  ఇటివల కొత్త మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే.. దీంతో వేలాది మంది పోటి పడి మరోసారి షాపులను దక్కించుకునేందుకు క్యూలో నిలుచున్న పరస్థితి కనిపించింది. ఇది ఇలా ఉంటే.. గత సంవత్సరం టెండర్లలో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారులకు మద్యం అమ్మకాలకు అనుమతి నేటితో ముగియనుంది. ( New Idea for collecting debt money ) అయితే ఇక్కడే చిక్కంతా వచ్చి పడింది. రెండు సంవత్సరాలు వ్యాపారం నిర్వహించిన వారు కొంతమంది తిరిగి టెండర్లు దక్కించుకోగా చాలా మందికి తిరిగి టెండర్లు దక్కని పరిస్థితి నెలకొంది.

  ఈ క్రమంలోనే గత రెండు సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహించిన ఓ మద్యం వ్యాపారికి ఓ సమస్య వచ్చిపడింది.గత సంవత్సరం యాదాద్రి భువనగిరి జిల్లాల చౌటుప్పల్ మండలంలోని మల్కాపురంలో ఒకరికి టెండర్ దక్కడంతో వైన్ షాప్ నిర్వహిస్తున్నాడు.( New Idea for collecting debt money ) సాధారణంగా మద్యం షాపుల్లో క్రెడిట్ పెట్టే పరిస్థితి కనిపించదు.. అయితే గ్రామీణ ప్రాంతాలు కావడంతో పాటు కొంతమంది తెలిసివారు ఉండడం రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యాపారం కావడంతో పాటు ఉన్న రెండు సంవత్సరాల్లో కరోనాతో వ్యాపారాలన్ని అతలాకుతలం అయిన పరిస్థితి నెలకొంది. దీంతో వ్యాపారంలో అప్పులు పెట్టకుండా నడిచే పరిస్థితి లేకపోవడంతో వినియోగదారులకు అప్పులు పెట్టక తప్పని పరిస్థితి అనివార్యమైంది.

  Telangana: టీఆర్ఎస్ ఆ MLC సీటు కోల్పోనుందా ? KCR మాటలకు అర్థమేంటి ?


  అయితే ఇలా ఆ వైన్స్ యజమాని సుమారు ఎనిమిది లక్షల మేర మద్యం ప్రియులకు అప్పులు పెట్టాడు. తీరా ఈ సంవత్సరరం టెండర్ రాలేదు.( New Idea for collecting debt money ) దీంతో తన అప్పులు అప్పులు ఇవ్వాలని కోరినా ఎవరు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు.. దీంతో ఓ వైపు రేపటితో షాపు క్లోజ్ చేయాల్సిన పరస్థితి ..మద్యం షాపు క్లోజ్ చేస్తే ఇచ్చిన అప్పులు తిరిగి రావడం గగనమే.. అవి బూడిద ఖాతాల కింద లెక్క చూసుకోవాల్సిందే..

  అయితే ఆ మద్యం వ్యాపారికి ఓ ఉపాయం చేశాడు. తన మద్యం సేవించేందుకు సాధారణంగా అప్పులు చేసి తాగడం అనేది పరువుకు సంబంధించిన సమస్య.. ఇక పరువుపై దెబ్బ కొడితే అప్పులు తీరుతాయని భావించాడు. ( New Idea for collecting debtmoney )దీంతో తనకు అప్పులున్న మద్యం వినియోగదారులు ఈనెల 29 వరకు చెల్లించాలని లేదంటే వారి పేర్లు ఫ్లేక్సీ ద్వారా ప్రజలకు తెలిసేలా రాయిస్తానని హెచ్చరిస్తూ తన మద్యం షాపు ముందు ఓ బ్యానర్ కట్టాడు.దీంతో ఆ బ్యానర్ కాస్తా సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చింది.

  Sardar Ravinder sing : నామినేషన్ వేశాడు.. కాని ఓటర్లు.. క్యాంపులో ఉంటే ప్రచారం ఎట్లా చేసేది...?


  దీంతో ఆ షాపు యజమాని వద్ద అప్పులు తీసుకున్న వారు దెబ్బకు జడిశారు. కొంతమంది వెంటనే తమ మందు బకాయిలను తెచ్చి ఇచ్చారు. ఇలా రెండు లక్షల వరకు వసూలు అయినట్టు ఆ వ్యాపారి తెలిపాడు..ఇక ప్రస్తుతానికి డబ్బులు లేని వారు... అయ్యా, బాబు తమ పేర్లను బయట పెట్టకు రెండు మూడు రోజుల్లో డబ్బులు ఇస్తానంటూ ప్రాధేయపడ్డారు. దీంతో అప్పులు వసూలు అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయని యజమాని చెప్పాడు. సో మొత్తం మీద అప్పుల ఐడియాకు సోషల్ మీడియాలో హచ్‌చల్ చేస్తోంది.

  అయితే ఐడియా బాగానే ఉన్నా ఎంతమంది అప్పులు ఇచ్చారు. బ్యానర్‌లో సూచించిన టైం వరకు ఇస్తారా లేక తమ పేర్లను ప్రజలకు తెలిసేలా బయటపెట్టెవరకు చూస్తారా అనేది చూడాల్సిందే..

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Telangana, Wine shops, Yadadri

  ఉత్తమ కథలు