ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో సీబీఐ విచారణ నిలుపుదల చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానాలను ఆశ్రయిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై పలుసార్లు హైకోర్టు ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీంకోర్టు(Supreme court) తలుపు కూడా తట్టింది. అయితే ప్రస్తుతానికి రాష్ట్రం ప్రభుత్వానికి మాత్రం ఈ కేసు విషయంలో ఎక్కడా ఊరట లభించలేదు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ తమకు అప్పగించాలని సీబీఐ(CBI) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి(CS Shanti kumari) మరోసారి లేఖ రాసింది. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు లేఖలు రాసిన సీబీఐ.. తాజాగా బుధవారం మరోసారి లేఖ రాయడం రాసింది.
ఈ కేసు విచారణను సిట్ నుంచి సీబీఐకి అప్పగిస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లేవరకు ఉత్తర్వులు అమలు నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. మరోవైపు కేసు విచారణ సుప్రీంకోర్టుకు అప్పగించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 17న విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. అయితే అప్పటి వరకు హైకోర్టు ఉత్తర్వులపై స్టేటస్ కో విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు నిరాకరించింది.
మరోవైపు సీబీఐ ఇప్పటికే దస్త్రాల కోసం ఒత్తిడి తెస్తోందని ఒకవేళ సీబీఐకి ఫైల్స్ ఇస్తే సుప్రీంలో ప్రభుత్వ పిటిషన్ నీరుగారిపోతుందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేసులో మెరిట్స్ ఉంటే హైకోర్ట్ తీర్పును రివర్స్ చేస్తామన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. స్టేటస్ కో ఇవ్వడానికి మాత్రం నిరాకరించారు.
Revanth Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ సీనియర్లు దూరంగా ఉంటున్నారా ?
Kondagattu: హనుమాన్ భక్తులకు శుభవార్త.. కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు..!
ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన అన్ని ఫైల్స్ అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. మరి.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ కోరినట్టుగా విచారణకు సంబంధించిన ఫైల్స్ అందిస్తుందా ?.. అలా జరగకపోతే సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.