కేంద్రం రాష్ట్రానికి ఎప్పుడు కరోనా వ్యాక్సిన్ పంపించినా.. వాటిని ప్రజలకు పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రోజుకు 10 లక్షల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మొదటి కరోనా వ్యాక్సిన్ తానే తీసుకుంటానని ఈటల ప్రకటించారు. రాష్ట్రంలో రెండో దశ డ్రై రన్ విజవంతమైందని ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా కొత్త స్ట్రెయిన్ వైరస్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వల్ల ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. బర్డ్ ఫ్లూ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.
వైద్య రంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రజల ధైర్యం, ప్రభుత్వ ముందస్తు చర్యల కారణంగా రాష్ట్రంలో కరోనా వైరస్ అంతగా విజృంభించలేదని ఈటల అన్నారు. నిమ్స్‌లో ఆధునికీకరించిన క్యాన్సర్ విభాగాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు. క్యాన్సర్ విభాగం ఆధునికీకరణకు మేఘా సంస్థ రూ.18 కోట్లు అందించింది. ఈ కార్యక్రమంలో మేఘా సంస్థ ఛైర్మన్ పి.పి.రెడ్డి, డైరెక్టర్ సుధారెడ్డి పాల్గొన్నారు. ఈ విభాగం ద్వారా నిమ్స్‌లో క్యాన్సర్ రోగులకు ఆధునిక వైద్యం అందుబాటులోకి రానుంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.