Home /News /telangana /

WILL RS PRAVEEN KUMAR HARM TRS PRV

Telangana: ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​ టీఆర్ఎస్​కు నష్టం చేకూరుస్తారా?

RS Praveen kumar

RS Praveen kumar

హుజూరాబాద్​ ఉప ఎన్నికను టీఆర్​ఎస్​ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే కౌశిక్​ రెడ్డి ఆడియో లీక్​ కావడంతో అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు దళిత ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడింది. ఇదే సమయంలో ఐపీఎస్​ అధికారి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ రాజీనామా టీఆర్​ఎస్​లో గుబులు రేపుతోంది.

ఇంకా చదవండి ...
  రేపల్లె శివ ప్రవీణ్​కుమార్​. 1995 ఐపీఎస్​ అధికారి.  తెలుగు రాష్ట్రాల్లో ఆర్​​ఎస్​ ప్రవీణ్​కుమార్​గా ప్రసిద్ధి. అయితే ఐపీఎస్​గా ఆయన అందించిన సేవలతోనే కాకుండా బలహీన వర్గాలకు అండగా నిలబడి తెలుగు రాష్ట్రాల్లో అంతే పేరు తెచ్చుకున్నారు. ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ అంటే బలహీన వర్గాల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఏ ఊరికెళ్లినా ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అంటే ఇట్టే ఆయన గురించి అనర్గళంగా చెప్పేస్తారు.  చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఆయనను విమర్శించాలంటే రెండు, మూడు సార్లు ఆలోచించే స్థాయికి ప్రవీణ్​కుమార్​ ఎదిగారు. కానీ, సడెన్​గా ఆయన రాజకీయ నాయకులకు ప్రత్యర్థి అయిపోయారు. కారణం ఆయన అకస్మాత్తుగా వీఆర్​ఎస్​ తీసుకోవడం. అయితే తాను ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదని బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటానికే పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. కానీ, ఎప్పుడూ లేనిది ఆయన రాజకీయాల గురించి మాట్లాడటం. ఇదే సమయంలో హుజూరాబాద్​ అసెంబ్లీ స్థానం ఖాళీ అవడం. అక్కడ బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉండటం. టీఆర్​ఎస్​ బాస్​ను విమర్శిస్తూ ఉండటం పలువురిలో అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ హుజూరాబాద్​ ఉప ఎన్నికల బరిలోకి దిగితే ఎవరికి నష్టం.. ఏ పార్టీకి లాభం.. తెలుసుకుందాం..

  బడుగు వర్గాల అభ్యున్నతి కోసమే...

  హూజూరాబాద్​ ఉప ఎన్నికను టీఆర్​ఎస్​ ఆత్మగౌరవ ప్రతీకగా తీసుకుంది. దీంతో దళిత బంధుకు సైతం హుజూరాబాద్​ను పైలట్​ ప్రాజెక్టుగా ఎన్నుకుంది. అక్కడ సామాన్యంగా బలహీన వర్గాల ఓట్లు రాబట్టుకొనే ఉద్ధేశంతోనే దళితబంధు ప్రారంభించారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఏది ఏమైనా ఈ దళిత బంధుతో అక్కడ బలహీన వర్గాల్లో కేసీఆర్​ కొద్దో గొప్పో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. అదే మాదిరిగా అవి ఓట్ల రూపంలో వచ్చే వీలుంది. కాగా, కౌశిక్​ రెడ్డి ఆడియో లీక్​ కావడంతో అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది.  అయితే ఇక్కడే ప్రవీణ్​కుమార్​ ఎంటరయ్యారు. తన రాజీనామా అనంతరం ఓ రాజకీయ పార్టీలో చేరేది లేదని చెప్పినప్పటికీ.. తెలంగాణలోని ఓ మాజీ ఐపీఎస్​ అధికారి బీఎస్పీలోకి వస్తున్నారని మాయావతి చెప్పడం తెలంగాణలో చర్చలకు దారి తీసింది. ఇక ప్రవీణ్​ కుమార్​ స్పందిస్తూ అంబేడ్కర్​ బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. బహుజన, బడుగు వర్గాల అభ్యున్నతి కోసమే తాను పనిచేస్తానని స్పష్టంచేశారు. ఇందులో సందేహానికి తావులేదని వివరించారు. మరోవైపు ఈనెల 8న నల్లగొండలో ఆయన భారీ సభ ఏర్పాటుచేసుకున్నారు.  ఇది హుజూరాబాద్​లో పోటీకి ఓ సంకేతమనే రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

  దళతులు అటువైపేనా..

  కాగా, అన్నీ కుదిరి చివరి నిమిషంలో ప్రవీణ్​కుమార్​ హుజూరాబాద్​ ఉప ఎన్నికలో బరిలోకి దిగితే మాత్రం టీఆర్​ఎస్​కు కష్టాలు తప్పవు. ఎందుకంటే దళితుల ఓట్లపై గులాబీ దళం నమ్మకం పెట్టుకుంది. ఇపుడు ఏకంగా దళితుల్లో ఆదరణ ఉన్న ప్రవీణ్​కుమార్​ రంగంలోకి దిగితే ఆయన వైపే దళిత ఓటర్లు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇది టీఆర్​ఎస్​ ఓట్లకు ఓ రకంగా గండి కొట్టడమే అవుతుంది. మరోవైపు ఇది బీజేపీకి లేదా కాంగ్రెస్​కు పరోక్షంగా లాభం చేకూర్చే అవకాశం ఉంది.  కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక​లో పోటీ చేస్తానని ప్రవీణ్​కుమార్​ ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ ప్రవీణ్​కుమార్​ పోటీలో లేకుంటే టీఆర్​ఎస్​కు ప్రయోజనమే.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bsp, Praveen, Telangana, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు