కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వాలి.. లేదంటే దీక్షకు సిద్ధమన్న జగ్గారెడ్డి

ఒకవేళ అపాయింట్‌‌మెంట్ ఇవ్వకపోతే ప్రగతిభవన్ ముందు తన కుమార్తె జయరెడ్డితో కలిసి భవిష్యత్తులో దీక్షకు కూర్చుంటానని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.

news18-telugu
Updated: September 2, 2020, 2:03 PM IST
కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వాలి.. లేదంటే దీక్షకు సిద్ధమన్న జగ్గారెడ్డి
సీఎం కేసీఆర్, జగ్గారెడ్డి
  • Share this:
తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నానన్న ఆయన'ఇప్పుడు ఉన్నట్టుండి.. సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరడం చర్చనీయాంశమైంది. ఐతే ఆయనకు సీఎం అపాయింట్‌మెంట్ దొరకలేదు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో వారం రోజుల పాటు సంతపా దినాలు ఉన్నందున వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఐతే తాను సీఎం కేసీఆర్‌ను ఖచ్చితంగా కలుస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఒకవేళ అపాయింట్‌‌మెంట్ ఇవ్వకపోతే ప్రగతిభవన్ ముందు తన కుమార్తె జయరెడ్డితో కలిసి భవిష్యత్తులో దీక్షకు కూర్చుంటానని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.

కొంతకాలంగా ఆర్థికమంత్రి హరీష్ రావును జగ్గారెడ్డి టార్గెట్ చేశారు. ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సింగూరు జ‌లాల‌ని సంగ‌రెడ్డి ప్ర‌జ‌ల‌కు కాకుండా సిద్దిపేటకు త‌ర‌లించుకుపోతున్నార‌ని మండిపడుతున్నారు. హరీష్‌ రావుపై ఆగ్రహంతో ఊగిపోతున్న జగ్గారెడ్డి.. సీఎం అపాయింట్‌మెంట్ ఎందుకు కోరారన్న దానిపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలను వివరించడానికే సీఎం అపాయింట్‌మెంట్ కోరానని ఆయన చెబుతున్నప్పటికీ.. వేరే కారణం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన రాజకీయ అవసరాల కోసమే సీఎంను కలవాలని జగ్గారెడ్డి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: September 2, 2020, 2:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading