హోమ్ /వార్తలు /తెలంగాణ /

Breaking News: రేపు కలవలేను..సీబీఐకి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ

Breaking News: రేపు కలవలేను..సీబీఐకి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ

ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఇటీవల సిబిఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏ నోటిసులపై స్పందించిన కవిత సీబీఐకి లేఖ రాసింది. కేసుకు సంబంధించి FIR, ఫిర్యాదు కాపీని సీబీఐ ఈ మెయిల్ చేసింది. అయితే ఈ FIR కాపీలో తన పేరు లేదని, రేపు సీబీఐ విచారణకు అందుబాటులో ఉండలేనని మరోసారి కవిత లేఖ రాసింది. అయితే ఈనెల 11, 12, 14,15 తేదీల్లో హైదరాబాద్ లోని తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటా అని ఆమె తెలిపింది. నేను చట్టాన్ని గౌరవిస్తా..దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తా అని కవిత పేర్కొన్నారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఇటీవల సిబిఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏ నోటిసులపై స్పందించిన కవిత సీబీఐకి లేఖ రాసింది. కేసుకు సంబంధించి FIR, ఫిర్యాదు కాపీని సీబీఐ ఈ మెయిల్ చేసింది. అయితే ఈ FIR కాపీలో తన పేరు లేదని, రేపు సీబీఐ విచారణకు అందుబాటులో ఉండలేనని మరోసారి కవిత లేఖ రాసింది. అయితే ఈనెల 11, 12, 14,15 తేదీల్లో హైదరాబాద్ లోని తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటా అని ఆమె తెలిపింది. నేను చట్టాన్ని గౌరవిస్తా..దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తా అని కవిత పేర్కొన్నారు. కాగా ఆమె ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నట్టు తెలుస్తుంది.

TS News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాదర్శకత కోసమే ఇదంతా..

డిసెంబర్ 6న హాజరవుతా..

అయితే ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న కవితను సిబిఐ హైదరాబాద్ లో ఎక్కడైనా హాజరవ్వొచ్చు అని పేర్కొంది. దీనిపై స్పందించిన కవిత డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో విచారణకు సహకరిస్తా అని, కానీ కేసుకు సంబంధించి FIR, ఫిర్యాదు కాపీ ఇవ్వాలని ఆమె సీబీఐకి లేఖ రాసింది. ఈ క్రమంలో సీబీఐ సంబంధిత వెబ్ సైట్ లో కేసుకు సంబంధించిన FIR, ఫిర్యాదు కాపీని అందుబాటులో ఉంచింది.అనంతరం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో కవిత భేటీ అయ్యారు. ఈ భేటీలో నెక్స్ట్ ఏం చేయాలి అనేదానిపై ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే సడన్ గా కవిత మరోసారి సీబీకి లేఖ రాయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.

Horoscope Today: ఈ రెండు రాశుల వారు ఈరోజు కుటుంబ సభ్యులు తప్ప ఎవరి మాటలు విన్నా నష్ట పోతారు

రెండోసారి లేఖలో ఏముందంటే?

కేసుకు సంబంధించి FIR, ఫిర్యాదు కాపీలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్టు చేసిన ఈ మెయిల్ ను స్వీకరించాను. అయితే అందులో విషయాలు, నిందితుల జాబితా, ఫిర్యాదులోని అంశాలను క్షుణ్ణంగా గమనించాను. కానీ ఎక్కడా కూడా తన పేరు అందులో ప్రస్తావనకు రాలేదని గుర్తు చేస్తున్నాను. ఇక మీరు ప్రతిపాదించినట్టు నేను డిసెంబర్ 6వ తేదీన నేను కలవలేను. ముందుగా ఖరారు అయిన షెడ్యూల్ కారణంగా నేను రేపు హాజరు కాలేను. అయితే ఈనెల 11, 12, 14,15 తేదీల్లో ఏది అనుకూలమో ఆ సమయంలో మిమ్మల్ని కలవగలను అని కవిత లేఖలో పేర్కొన్నారు.

కేసీఆర్ తో మరోసారి భేటీ..

అయితే నేడు ప్రగతి భవన్ లో కవిత మరోసారి కేసీఆర్ తో భేటీ కానున్నారు. కేసుకు సంబంధించి ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై వీరిద్దరి మధ్య చర్చ జరగనున్నట్టు తెలుస్తుంది.

First published:

Tags: CM KCR, Hyderabad, Kalvakuntla Kavitha, Telangana, Trs

ఉత్తమ కథలు