ఏపీలోని ఆ ప్రాజెక్టులు ఆపకుంటే తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్.. సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా, ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు తన ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే కుదరదని కేసీఆర్ అన్నారు.

news18-telugu
Updated: October 6, 2020, 11:19 PM IST
ఏపీలోని ఆ ప్రాజెక్టులు ఆపకుంటే తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్.. సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
సీఎం కేసీఆర్
  • Share this:
ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు సహా అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపాలని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు మరోసారి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలోలాగా తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే.. తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని వ్యాఖ్యానించారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా, ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు తన ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే కుదరదని కేసీఆర్ అన్నారు.

క్రమశిక్షణను ఉల్లంఘించి, తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే సహించేది లేదని అన్నారు. తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. తమ వైఖరిని స్పష్టం చేశారు. నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమని కేసీఆర్ అన్నారు. భారత యూనియన్‌లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి అంతర్ రాష్ట్ర నదీజలాల్లో న్యాయమైన వాటాను పొందే హక్కు ఉన్నదని అన్నారు.

Cm kcr news, telangana new project on Krishna river, telangana news, telangana latest news, సీఎం కేసీఆర్ న్యూస్, కృష్ణా నదిపై తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్, తెలంగాణ న్యూస్
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)


కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ దిశగా స్వయంగా కేంద్రమే స్పష్టమైన ఆదేశాలిచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ కొనసాగించడం బాధాకరమని తెలిపారు. ఆయకట్టు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలానికి గండిపెడుతూ నిర్మితమవుతున్న పోతిరెడ్డిపాడు కెనాల్‌ను తెలంగాణ ఉద్యమకాలం నుంచే తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నదని అన్నారు. అయినా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా పోతిరెడ్డి పాడును మరింత విస్తరించడాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.

తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నదీ జలాల వివరాలను కేంద్రానికి వివరించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్‌లో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ప్రారంభంలోనే అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956-సెక్షన్ 3 కింద ఫిర్యాదుల స్వీకరణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తాము కేంద్రానికి లేఖ రాశామని అన్నారు. తక్షణమే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రికి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం మొదలైందని, తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే గోదావరి నదీమీద ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని అన్నారు. తమ అభ్యంతరాలతో పాటు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర జల్ శక్తి మంత్రి ఈ ఏడాది ఆగస్టు 20న లేఖ రాసిన సంగతిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Cm kcr news, telangana new project on Krishna river, telangana news, telangana latest news, సీఎం కేసీఆర్ న్యూస్, కృష్ణా నదిపై తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్, తెలంగాణ న్యూస్
తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)


కేంద్రం ఇంత స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచి, పనులు కొనసాగించడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం పంపిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్నఅక్రమ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేసే దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండివైఖరితో క్రమశిక్షణను ఉల్లంఘించి అక్రమ నీటి ప్రాజెక్టుల పనులను కొనసాగిస్తే.. తాము కూడా తమ రైతుల సాగునీటి అవసరాల కోసం మహారాష్ట నిర్మించిన బాబ్లీ బ్యారేజీ మాదిరిగా.. కృష్ణా నదిపై అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బ్యారేజీని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను చర్చల ద్వారా పరిష్కరించడానికి కేంద్రం ముందుకు వస్తే, తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సహకరిస్తుందని అయితే, బోర్డులు సమర్ధవంతంగా పనిచేయాలంటే ముందు నీటి కేటాయింపులు జరిపి, వాటి పరిధిని నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. నాలుగేళ్ల కింద మొదటిసారి జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వివరాలను సరిగా నమోదు చేయలేదని, నేటి రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జరిపిన చర్చను తీసుకున్న నిర్ణయాలను వీడియో, రాతపూర్వకంగా నమోదు చేయాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి, ముఖ్యమంత్రుల సంతకాలు తీసుకున్న తర్వాతే మినట్స్‌ను అధికారికంగా విడుదల చేయాలని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: October 6, 2020, 8:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading