తెలంగాణలో రైతులకు శుభవార్త... కేసీఆర్ కీలక ప్రకటన...

రాష్ట్రంలో పండించిన ప్రతి కేజీ ధాన్యాన్ని కొంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.

news18-telugu
Updated: March 29, 2020, 9:02 PM IST
తెలంగాణలో రైతులకు శుభవార్త... కేసీఆర్ కీలక ప్రకటన...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో పండిన ప్రతి కేజీ పంటను కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు ‘రైతులు ఆందోళన చెందవద్దు. పండిన ప్రతి కేజీని కొనుగోలు చేస్తాం. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న మాట. సీఎంగా చెబుతున్నా.’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పండిన వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే కొంటుందని కేసీఆర్ చెప్పారు. వారి ఖాతాల్లోనే ఆన్ లైన్ ద్వారా నగదు జమ అవుతుందని తెలిపారు. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో మార్కెట్లు మొత్తం మూసేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. రైతులకు కూపన్ ఇచ్చి వారికి కేటాయించిన తేదీ రోజే మార్కెట్‌‌కు తీసుకురావాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోటీ 5 లక్షల టన్నుల ధాన్యం కొనాలంటే అందుకు 75 లక్షల గోనె సంచుల అవసరం ఉందన్నారు. అయితే, గోనెసంచులు తయారు చేసే పరిశ్రమలు కూడా మూతపడ్డాయని కేసీఆర్ చెప్పారు. గ్రామాల్లోనే ధాన్యాన్ని కొంటారు కాబట్టి, రైతులు ఎవరూ మార్కెట్‌కు ధాన్యం తీసుకురావొద్దని కేసీఆర్ రైతులను అభ్యర్థించారు. కనీస మద్దతు ధర ఇస్తేనే ఇతర వ్యాపారులకు ధాన్యం అమ్మాలని రైతులకు కేసీఆర్ సూచించారు.

మార్క్ ఫెడ్‌కు రూ.3200 కోట్లు సమకూర్చినట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. గ్రామాల్లో ప్రజలు సరిహద్దుల్లో కంచెలు వేసి, ఎవరినీ రానీయకపోవడం మంచిది కాదన్నారు. కొన్ని అవసరమైన వాటికి అనుమతివ్వాలని చెప్పారు. స్వీయ నియంత్రణ మంచిదే అయినా, పట్టు విడుపులు అవసరమని కేసీఆర్ చెప్పారు.

First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading