హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka By Election 2020: టీఆర్ఎస్ కు షాక్ తప్పదా..? దుబ్బాక బీజేపీదేనా..?

Dubbaka By Election 2020: టీఆర్ఎస్ కు షాక్ తప్పదా..? దుబ్బాక బీజేపీదేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో నిన్న ముగిసిన అత్యంత ప్రతిష్టాత్మక దుబ్బాక ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ తగలనుందా..? 2023 అసెంబ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ వేసుకుంటున్న బీజేపీ అధికార పార్టీకి షాక్ ఇవ్వనుందా..? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి...?

 • News18
 • Last Updated :

  తెలంగాణలో నిన్న ముగిసిన అత్యంత ప్రతిష్టాత్మక దుబ్బాక ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ తగలనుందా..? 2023 అసెంబ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ వేసుకుంటున్న బీజేపీ అధికార పార్టీకి షాక్ ఇవ్వనుందా..? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి..? పలు సంస్థలు విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్.. సర్వే రిపోర్టులు చూస్తే టీఆర్ఎస్ కు షాక్ తప్పదనే సూచిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం విడుదలైన రెండు సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో మిశ్రమ ఫలితాలు రాగా.. తాజాగా మరో సంస్థ తన సర్వే రిపోర్టును వెలువరించింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్ తప్పదని ఆ సర్వే చెబుతున్నది. ఇంతకీ ఆ సర్వేలో ఏముంది..?

  దుబ్బాక ఉప ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ బై పబ్లిక్ పల్స్ అనే సంస్థ తన సర్వే రిపోర్టును వెలువరించింది. ఇందులో అధికార టీఆర్ఎస్ కు బీజేపీ షాక్ ఇవ్వడం ఖాయమని ప్రచురించింది. దుబ్బాకలో టీఆర్ఎస్ కు 42.5 శాతం ఓట్లు వస్తే.. బీజేపీకి 45.2 శాతం వస్తాయని తెలిపింది. ఇక కాంగ్రెస్ కు 11.7 శాతం ఓట్లు రావొచ్చని అంచనా వేసింది. బీజేపీ గెలుస్తుందని.. అయితే ఓట్ల తేడా 4 వేల నుంచి 6 వేల మధ్య ఉండనుందని పేర్కొంది.

  మండలాల వారీగా ఏ మండలంలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయనేదానిమీద కూడా అది డేటా విడుదల చేసింది. నియోజకవర్గం పరిధిలోని దుబ్బాక.. మిరుదొడ్డి,చేగుంట, నార్సింగి లలో బీజేపీ మెజారిటీ సాధిస్తుందని అంచనా వేసింది. ఇక రాయపోల్, దౌలతాబాద్ లలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధిస్తుందని.. తోగుటలో కాంగ్రెస్ కు ఆధిక్యం వస్తుందని సర్వేలో పేర్కొంది.

  ఇక మంగళవారం సాయంత్రం కూడా పొలిటికల్ ల్యాబోరేటరీ అనే సంస్థ కూడా.. బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపిన విషయం తెలిసిందే. థర్డ్ విజన్ అనే సంస్థ మాత్రం దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం ఖాయమని చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. కౌంటింగ్ ప్రక్రియ ముగిస్తేనే విజేత ఎవరనేది తేలుతుంది.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Siddipet, Telangana

  ఉత్తమ కథలు