WILL ALLOW TO WRITE ADVANCED SUPPLEMENTARY FOR STUDENTS WHO ARE NOTABLE TO WRITE EXAMS NOW SAYS TELANGANA GOVT SK
టెన్త్ పరీక్షలపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు
(ప్రతీకాత్మక చిత్రం)
ఈసారి పరీక్షలు రాయలేని వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో అవకాశం కల్పిస్తామని కీలక వ్యాఖ్యలు చేసింది. ఐతే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే వారిని రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తారా.. అని ఏజీని ప్రశ్నించింది కోర్టు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల వ్యవహారం హైకోర్టులో తేలడం లేదు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం కూడా కోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్ల హాస్టళ్లను తాత్కాలికంగా తెరిచేందుకు అనుమతిస్తామని కోర్టుకు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. ఈసారి పరీక్షలు రాయలేని వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో అవకాశం కల్పిస్తామని కీలక వ్యాఖ్యలు చేసింది. ఐతే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే వారిని రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తారా.. అని ఏజీని ప్రశ్నించింది కోర్టు. అంతేకాదు కంటైన్మెంట్ జోన్లలో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది? దీనిపై ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలుసుకొని రేపు కోర్టుకు తెలుపుతామని ఏజీ చెప్పారు. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలపై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.
ఇటీవల లాక్డౌన్ నుంచి ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరింది ప్రభుత్వం. కోవిడ్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. ఐతే జూన్ 8 నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని అప్పుడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలను కూడా ఇచ్చింది. కరోనా విజృంభిస్తున్న వేళ పరీక్షలు నిర్వహించకకూడదని పిటిషన్ మరోసారి కోర్టును ఆశ్రయించడంతో.. దీనిపై రివ్యూ చేసిన హైకోర్టు మళ్లీ విచారిస్తోంది.
టెన్త్ పరీక్షలను నిర్వహించకూడదని దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్‌చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల 8 నుంచి పదోతరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధంచేశామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ గురువారం హైకోర్టుకు నివేదించారు. పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని విజ్ఞప్తిచేశారు. ఐతే కేసులు పెరుగుతున్నా పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపుతున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు గత ఆదేశాలను అనుసరిస్తూ జూన్ 8 నుంచి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. దీనిపై శనివారం క్లారిటీ వచ్చే అవకాశముంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.