మెదక్: భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకొని వెళ్లిపోవడంతో ఈ విషయంలో తన భార్య బంధువుల ప్రమేయం ఉందని వారిలో ఇద్దరిని హత్య చేశాడు. 2006లో జరిగిన ఈ హత్య కేసుల్లో అతను చర్లపల్లి జైల్లో జీవిత ఖైదు అనుభవించి గత 15 రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే.. జైలు నుంచి విడుదలయ్యాక సైకోలా మారాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఇతను కామ జ్వరంతో రగిలిపోతూ ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వారిపై అత్యాచారం చేసి హత్య చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడు. కానీ.. చేసిన నేరం ఏనాటికైనా బయటపడక తప్పదు కద. పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి సిద్ధిపేట టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కోల్చరాం మండలం రంగంపేట్ గ్రామనికి చెందిన షేక్ షాబుద్దిన్ కలాయి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో తన మొదటి భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ విషయంలో వారి బంధువులు ఇద్దరి ప్రమేయం ఉందని అని వారిని హత్య చేసిన కేసులో 2006లో జీవిత ఖైదు శిక్ష పడి చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవించాడు. గత రెండు నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని కోరికలను తీర్చకపోతే ఆ మహిళలను హత్య చేశాడు. సిద్దిపేట పట్టణంలోని కెసిఆర్ నగర్‌లో ఉంటున్న లక్ష్మి అనే మహిళకు షాబుద్దిన్‌కు గతంలో పరిచయం ఉంది. ఆమెను కలిసిన షాబుద్దిన్ తన కోరిక తీర్చలేదని అతి దారుణంగా హత్య చేసి మెడకు చీర బిగించి హత్య చేశాడు. అదే రోజు రాత్రికి దుద్దెడ గ్రామంలో ఒంటరిగా ఉంటున్న మర్కుక్ మండలానికి చెందిన స్వరూప అనే మహిళ అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్న ఓ దుకాణం ముందు ఉండగా మద్యం మత్తులో షాబుద్దిన్ తన కోరిక తీర్చాలంటూ అడిగాడు. ఆ మహిళ అందుకు నిరాకరించడంతో ఆమెను రాయితో నుదిటిపై కొట్టి హత్య చేశాడు.
ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగడానికి నిందితుడు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సిద్దిపేట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఈ రెండు హత్యల వివరాలు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. షాబుద్దిన్ నుంచి రెండు సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షేక్ షాబుద్దిన్‌ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
కె.వీరన్న, News 18 ప్రతినిధి
మెదక్ జిల్లా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Extra marital affair, Latest news, Medak, Telangana crime news