Home /News /telangana /

Karimnagar : ఆన్‌లైన్‌లో ప్రేమ ..ఆర్యసమాజ్‌లో పెళ్లి.. కట్ చేస్తే..

Karimnagar : ఆన్‌లైన్‌లో ప్రేమ ..ఆర్యసమాజ్‌లో పెళ్లి.. కట్ చేస్తే..

love affair

love affair

Karimnagar : ఆన్‌లైన్‌ చాటింగ్‌తో ఒక్కటైన ఓ యువ జంట కొద్ది రోజుల పాటు ప్రేమించుకుని ఆ తర్వాత ఆర్యసమాజ్‌లో పెళ్లి డా చేసుకున్నారు. ( Wife protest )అయితే సంవత్సరం తిరిగేలోపే.. ఆ యువతి, యువకుడి ఇంటిముందు బైఠాయించింది.

  నేటి యువతకు ప్రేమలో పడడం ఎంత ఈజీ అవుతుందో.. అంతే ఈజీగా విడిపోవడం కూడా చేసుకుంటుంది. తల్లిదండ్రులను కాదని ప్రేమించుకోవడం .. వద్దని వారిస్తే పారిపోయి పెళ్లి చేసుకోవడం అనేది ఇప్పటి యువతకు కామన్‌న్ మారింది. అయితే అంతే త్వరగా ఒకరిపై ఒకరు విద్వేషాలు పెంచుకుని విడిపోయేందుకు కూడా వెనకాడడం లేదు.. ప్రేమ కొద్ది రోజులే అయినా.. పెళ్లి జీవితం భవిష్యత్‌పై ముడిపడి ఉందనే కనీస ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడంతో అనేక పరిణామాలకు కారణమవుతున్నాయి.

  ఈ క్రమంలోనే ఓ యువతిని ఆన్‌లైన్ ప్రేమ కొంపముంచింది .( Wife protest in front of her husband house ) ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని చివరకు పెళ్లి కూడా చేసుకున్నారు.సంవత్సర కాలంగా అంతా బాగుందని అనుకునే లోపే భర్త, భార్యకు ట్విస్ట్ ఇచ్చాడు.. తమకు జరిగింది అసలు పెళ్లి కాదనే ధోరణితో వ్యవహరించాడు. దీంతో తనను కాపురానికి తీసుకుని వెళ్లేవరకు ఇంటిముందు బైఠాయిస్తానని ఆ యువతి భీష్మించుకు కూర్చుంది. ( Wife protest in front of her husband house.) వివరాల్లోకివెళితే .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపకు చెందిన సుహాసిని తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతానికి చెందిన సుజిత్ లు ఇద్దరు ' యాహు డాట్ కామ్ ' ద్వారా పరిచయమై ఆన్ లైన్ చాటింగ్‌లో మునిగితేలారు .చాటింగ్ కాస్తా కొన్ని రోజుల తరువాత ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడడంతో ప్రేమలో పడ్డారు..

  Adilabad mlc : ఒక్కరు విరమించుకుంటే ఏకగ్రీవమే... కాని ఆ ఒక్క మహిళతో ఉద్రిక్తత.. పోలీసుల ఎంటర్


  ఇలా కొన్ని రోజుల పాటు ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో వాళ్లకు తెలియకుండా గత సంవత్సరం హైదరాబాద్ లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు . ఇక పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్ కోసం కొన్ని రోజుల పాటు కడప , తిరుపతి , హైదరాబాద్ పలు ప్రాంతాలకు వెళ్లి అక్కడ పలు అతిథి గృహాల్లో ఉండి వచ్చారు.. ( Wife protest in front of her husband house )అయితే సుజిత్ పెళ్లి విషయం ఇంట్లో తెలిసింది. దీంతో సుజిత్‌ను కుటుంబ సభ్యులు నిలదీశారు.. ఆ తర్వాత ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి... ఘర్షణ తర్వాత ఇరు కుటుంబాల సభ్యులు రాజీకి వచ్చారు. అనంతరం ఇద్దరిని కలిసి ఉండమని హితభోద చేశారు.. వారు చేసుకున్న పెళ్లికి అంగీకరించారు.. ఈ క్రమంలోనే సుహాసినికి సైతం నచ్చజెప్పి కొద్ది రోజుల వేచి ఉన్న తర్వాత తిరిగి హైదరాబాద్ తీసుకుని వెళతామని చెప్పారు. ఈ క్రమంలోనే సుజిత్‌కు కొంత డబ్బును కట్నం కింద ముట్టజెప్పారు. ( Wife protest in front of her husband houseకాగా ) భర్త మాటలు విన్న భార్య నమ్మి తన తల్లిగారి ఇంట్లోనే ఉంది.

  Paddy purchase : ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్....?


  కాని సుజిత్ మాత్రం కొద్ది రోజుల తర్వాత తన మనసుని మార్చుకుని సుహాసిని తీసుకుని వెళ్లడానికి ముందుకు రావడం లేదు.. ఫోన్ చేస్తే కట్ చేయడంతో పాటు మాట్లడడం మానేశాడు. దీంతో ఆందోళన చెందిన సుహాసిని, భర్త సుజిత్ అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడని ఆరా తీసింది...(Wife protest in front of her husband house )దీంతో సుజిత్ వరంగల్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఇన్చార్జిగా చేస్తున్నట్టు తెలుసుకుంది . కాగా ఆ తర్వాత ఆయన ఉంటున్న ఇంటి కనుక్కుని నేరుగా చేరుకుంది. కాని వాళ్లు ఇంట్లోకి రానీయకపోవడంతో..( Wife protest in front of her husband house )ఆందోళన పట్టింది. తన న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని, పెళ్లి చేసుకుని నిరాకరిస్తున్న సుజిత్ అంగీకరించి ఇంట్లోకి తీసుకుని వెళ్లే వరకు ఇంటిముందు బైఠాయించింది.

  మీ నగరం నుండి (కరీంనగర్)

  తెలంగాణ
  కరీంనగర్
  తెలంగాణ
  కరీంనగర్
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Karimnagar, Love affair

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు