హోమ్ /వార్తలు /తెలంగాణ /

Siddipet : ఆయన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అయినా భార్యకు తప్పని వేధింపులు..

Siddipet : ఆయన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అయినా భార్యకు తప్పని వేధింపులు..

భర్త ఇంటిముందు ధర్నా చేస్తున్న భార్య

భర్త ఇంటిముందు ధర్నా చేస్తున్న భార్య

Siddipet : పెళ్లి చేసుకున్న నెల రోజుల నుంచే మానసికంగా హింసిస్తూ తన పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కాపురానికి తీసుకోవడం లేదని ఒక వివాహిత భర్త ఇంటి ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది

  సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన భవ్య అనే యువతికి మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాటిపల్లి సంతోష్ కుమార్ తో 2020 ఆగస్టు 20వ తేదీన వివాహం జరిగింది. వివాహమైన నెల రోజుల నుండి మానసికంగా హింసించడమే కాకుండా తనను ఏకాంతంగా ఇంట్లో ఉంచి ఇబ్బంది పెట్టే వారని, పెద్దమనుషుల సమక్షంలో లో పలు సార్లు మాట్లాడినప్పటికీ తనను పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని భార్య తెలిపింది.


  తన ఆడపడుచు భర్త రమేష్ పోలీసు ఉద్యోగం చేస్తూ తమ భర్త ఆస్తి పై కన్ను వేసి తనతో కాపురం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని అని తెలిపింది అత్త . ఆడపడుచుతోపాటు ఆమె భర్త రమేష్. తాటిపల్లి సంతోష్ కుమార్ తను ఇబ్బంది పెడుతున్నారని భవ్య తెలిసింది. పండగకు తన తన పుట్టింటికి వెళితే ఇప్పటివరకు ఎవరు కాపురానికి తీసుకోవడం లేదని ఎన్నిసార్లు వచ్చిన ఇంటికి తాళం వేసి ఉంటుందని వారు భవ్య తెలిపింది. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ఆందోళన నిర్వహించింది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని భవ్య నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ తాను అక్కడే ఉంటానంటూ కూర్చుంది.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Dharna, Siddipet

  ఉత్తమ కథలు