హోమ్ /వార్తలు /తెలంగాణ /

Teenmar Mallanna : కేంద్రహోమంత్రి అమిత్ షాతో భేటి అయిన తీన్మార్ మల్లన్న భార్య.. కేసులపై లేఖ

Teenmar Mallanna : కేంద్రహోమంత్రి అమిత్ షాతో భేటి అయిన తీన్మార్ మల్లన్న భార్య.. కేసులపై లేఖ

Teenmar Mallanna : అమిత్ షాతో భేటి అయిన తీన్మార్ మల్లన్న భార్య.. కేసులపై లేఖ

Teenmar Mallanna : అమిత్ షాతో భేటి అయిన తీన్మార్ మల్లన్న భార్య.. కేసులపై లేఖ

Teenmar Mallanna : తీన్మార్ మల్లన్న భార్య నేడు ఢిల్లీలో అమిత్ షాను కలిసింది. మల్లన్నపై పెట్టిన వివరాలతో కూడిన ఓ నివేదికను అందించింది. మల్లన్నపై 35కేసులను తెలంగాణ పోలీసులు పెట్టారని చెప్పింది. కాగా ఆయన బీజేపిలో చేరనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే..

ఇంకా చదవండి ...

పలు ఆరోపణలపై జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తీన్మార్ మల్లన్న భార్య మాతమ్మ కేంద్రహోంహాఖ మంత్రి అమిత్ షాను కలిసింది. ఈ సంధర్భంగా తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు పెట్టారంటూ ఆమె వివరించారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు అనేక కేసులను ఉద్దేశపూర్వకంగా పెట్టినట్టు చెప్పారు. కేసుల ద్వార తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని వివరించారు. ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతూ జైలుకు పంపే విధంగా కుట్రకు తెరలేపారని చెప్పారు. దీంతో నేటి వరకు మల్లన్నపై 35 కేసులను నమోదు చేశారని.. ఒకకేసులు బెయిల్ వచ్చిన వెంటనే మరోకేసు పెట్టినట్టు ఆమె వివరించారు. అయితే మల్లన్నపై పెట్టిన కేసులపై కోర్టు కూడా ప్రశ్నించిందని చెప్పారు. ఈ క్రమంలోనే అక్రమ కేసులతో పాటు వివిధ అంశాలపై అమిత్ షాకు ఓ లేఖను కూడ అందించారు. కాగా మల్లన్న భార్య వెంట అమిత్ షాను కలిసిన వారిలో ఆమె సోదరుడితో పాటు ఎంపీ అరవింద్ కుమార్ కూడా ఉన్నారు.

గత కొద్ది రోజులుగా జైలు జీవితం గడిపుతున్న తీన్మార్ మల్లన్న (Teenmar mallanna) బీజేపీలో చేరుతున్నట్టు క్యూ న్యూస్ (Q news) ప్రకటించింది. మోదీ సిద్దాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్టు వారు ప్రకటించారు. మరోవైపు ఆయన్ను జైలు (jail) నుండి విడుదల చేయించాలని ఆయన బార్య సైతం ప్రధాని మోదీతోపాటు (pm modi )హోంమంత్రి అమిత్ షాకు (amit shah) ఈమెయిల్ ద్వార వేడుకుంది.

ఇది చదవండి : గ్రేట్ సీఎం.. సాధారణ ప్రజలతోనే ప్రయాణం.. తన సెక్యూరిటిపై కూడా...!


జ్యోతిష్యుడు లక్ష్మికాంత శర్మ పెట్టిన కేసులో ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు. అయితే కేసులో బెయిల్ వచ్చినా.. తిరిగి మరో కేసులో కోర్టుకు తరలించారు. దీంతో మరో పద్నాలుగా రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది. మరోవైపు ఆయనపై పదికి పైగా పోలీసు స్టేషన్లలో 35 కేసులు నమోదు కావడంతో తీన్మార్ మల్లన్న చివరికి బీజేపీలో (bjp)చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఇక జైలుకంటే ముందే క్యూ న్యూస్ కార్యాలయంలపై పోలీసులు పలుసార్లు దాడులు చేశారు. కార్యాలయంలో ఉన్న హర్డ్ డిస్క్‌లను తీసుకెళ్లారు. దీంతో బీజేపీ నేతలతో పాటు తీన్మార్ మల్లన్న అభిమానులు సిబ్బంది పలు సార్లు ఆందోళన సైతం నిర్వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీజేపీ నేతలు తీన్మార్ మల్లన్న పూర్తి మద్దతు ప్రకటించారు. వ్యక్తిగత పోరాటం కన్నా జాతీయ పార్టీ అండతో కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేయాలనే లక్ష్యంతో నే ఆ పార్టీలో చేరుతున్నట్టు సమాచారం.

ఇది చదవండి : అతి భక్తితో దారుణం... గుడికి వెళ్లి వచ్చిన భార్యపై భర్త దారుణం..


అయితే బీజేపీలోకి తీన్మార్ మల్లన్న చేరిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి. పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారా లేదా.. తన యూ ట్యూబ్ చానల్ ద్వారా ప్రభుత్వ విధానాలు ఎండగడతారా వేచి చూడాలి. ఇక ఆయన గతంలో కూడా కాంగ్రేస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా కూడా పోటి చేయగా గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటి చేసి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో హోరాహోరి పోరాడారు. ఈ క్రమంలోనే ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడడంతో పాటు ప్రభుత్వ విధానాలను ఆయన చానల్ ద్వారా ఎండగట్టాడు.

First published:

Tags: Amit Shah, Delhi, Teenmar mallanna

ఉత్తమ కథలు