WIFE OF ENGINEER WENT TO FOREST WHO KIDNAPPED BY MAOISTS TO RELEASE HIM VRY KMM
Khammam : పిల్లాడితో కలిసి భర్త కోసం అడవి బాట.. మరో రోజా సినిమాను తలపించే.. ఘటన..
భర్త కోసం అడవిలో గాలింపు
Khammam : భర్త కోసం ఓ మహిళ తన పిల్లాడితో కలిసి అడవిబాట పట్టింది. కిడ్నాప్ చేసిన భర్తను విడిచి పెట్టాలని అడవిలో ఉన్న గిరిజన గూడాల్లో పెద్దలను వేడుకుంటుంది.
జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులతో పాటు లొంగుబాట్లు, అరెస్ట్‌లు ఇటివలతీవ్రమయ్యాయి. ఏకంగా 26 మంది మావోలు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో పాటు అగ్రనేతల మృతి, తాజాగా జరుగుతున్న పరిణామాలు మావోయిస్టు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. దీంతో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలను ఆ పార్టీ మమ్మురం చేసింది. ఈ క్రమంలోనే చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజపూర్ జిల్లాలో ఈనెల 11న ఓ కిడ్నాప్ చోటుచేసుకుంది. అక్కడ మాన్‌ఖేడ్ ప్రాంతంలో ఘట్‌కర్న అనే ఊరికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రోడ్డు వేస్తుండగా.. ఆ పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించడానికి వెళ్లిన సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్‌ను, అతనితో బాటు ఉన్న అటెండర్ లక్ష్మణ్‌ను మావోయిస్టులు అపహరించారు.అయితే అటెండర్ లక్ష్మణ్‌ను మరుసటి రోజున విడిచి పెట్టిన మావోయిస్టులు సబ్ ఇంజినీర్‌ను మాత్రం ఇప్పటికీ వదల్లేదు. దీనిపై ఇప్పటికీ మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
దీంతో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఇంజినీర్ కోసం ఎదురుచూపులు చూస్తున్న ఆయన భార్య అర్పిత అడవిబాట పట్టింది. కట్టుకున్న వాణ్ని క్షేమంగా వదిలిపెట్టాలని మావోయిస్టులను వేడుకుంటూ ఆమె మూడేళ్ల కొడుకుని వెంట తీసుకుని మరీ దండకారణ్యంలోకి దారితీసింది. తన భర్త కేవలం ఉద్యోగం మాత్రమే చేస్తున్నాడని.. ప్రభుత్వంపైన ఉన్న ధ్వేషాన్ని తమ లాంటి చిన్న వాళ్లపైన చూపొద్దని, తన బతుకుని ఆగం చేయొద్దని ఆమె డుకుంటోంది. దీనికోసం ఆమె ఎవరూ చేయలేని సాహసం చేసింది. తనకు తెలిసిన వారి ద్విచక్ర వాహనంపైన కూర్చొని ఆమె సరిగ్గా రోడ్డు సౌకర్యం కూడా లేని గిరిజన గూడేలకు దారితీసింది. మావోయిస్టు సానుభూతిపరులైన గ్రామీణ గిరిజన గూడేళ్లోని పెద్దలను కలసి తన పరిస్థితి వివరిస్తోంది. ఎలాగోలా మాట్లాడి తన భర్తను విడిచిపెట్టాలని ప్రాధేయపడుతోంది. మూడేళ్ల చిన్నారిని తండ్రి లేని అనాథను చేయొద్దని వాపోతున్నది.
అయితే ఇంజనీర్ కిడ్నాప్ అయి వారం రోజులు గడుస్తున్నా.. అటు ప్రభుత్వం నుండి కాని, ఇటు మావోయిస్టుల నుండి ఎలాంటీ స్పందన కనిపించడం లేదు.. అయితే ఇంజనీర్ భార్య మాత్రం తన భర్తను విడిచిపెట్టాలంటూ అటవి గ్రామాల్లో తిరగడం సంచలనంగా మారింది.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.