Home /News /telangana /

WIFE KILLED HUSBAND WITH VEGITABLE KNIFE IN HYDERBAD VRY

Husband murder : కూరగాయల చాకుతో భర్తను చంపిన భార్య.. తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ ఆగ్రహం..

Husband murder : కూరగాయల చాకుతో భర్తను చంపిన భార్య..

Husband murder : కూరగాయల చాకుతో భర్తను చంపిన భార్య..

Husband murder : తాను ఇంట్లో లేనప్పుడు తప్పుగా ప్రచారం చేస్తున్నాడంటూ ఏకంగా భర్తనే హత్య చేసింది ఓ భార్య.. ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో భర్త మెడపై దాడి చేసి చేయడంతో అక్కడికక్కడే కూలిపోయాడు ఆ భర్త.

    చిన్న కారణాలకే భార్య,భర్తల మధ్య వివాదాలు హత్యల వరకు దారి తీస్తున్నాయి. దీంతో ఇద్దరి ఎవరు తప్పు చేసినా.. మరొకరు క్షమించలేని స్థితికి చేరుకుంటున్నారు.. దీంతో ఇరువురు మధ్య వివాదాలు చెలరేగడం ఆ వివాదాలు కాస్తా హత్యలకు సైతం దారీ తీస్తుండం ఆందోళన కల్గిస్తున్నా అంశాలు.. ఈక్రమంలోనే ఓ భార్య తన పై తప్పుడు ప్రచారం చేస్తున్నాడి భావించి, భర్తను ఇంట్లోని కూరగాయల కత్తితో హత్య చేసింది.

    సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈనెల 6వ తేదీ సాయంత్రం జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం బసిరెడ్డిగూడెంకు చెందిన మురళీధర్‌రెడ్డి (42), మిర్యాలగూడకు చెందిన మౌనిక (25)లకు 11 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరు సరూర్‌నగర్‌ శ్రీసాయికృష్ణనగర్‌ కాలనీలో ఉంటున్నారు. మురళీధర్‌రెడ్డి ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగి.

    ఇది చదవండి : 19 మంది మహిళలను మోసం చేసిన ఫ్రాడ్.. రెండో భార్య ఫిర్యాదులో వెలుగులోకి..


    కాగా, డిగ్రీ పరీక్ష రాసేందుకు గుంటూరు వెళ్లిన మౌనిక ఈనెల 6న సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. నీవు లేనప్పుడు నీగురించి నాన్న అందరికీ చెడుగా చెప్పాడని కుమారుడు తల్లికి చెప్పాడు.దీంతో భర్తను ఆమె నిలదీసింది. ఇష్టం లేకపోతే వదిలేయమని గొడవకు దిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మౌనిక వంటగదిలోని చాకుతో భర్త మెడపై పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో రక్తపు మడుగులో మురళీధర్‌రెడ్డి కుప్పకూలిపోయాడు.

    ఇది చదవండి : గుస్సాడీ గురువుకు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం..


    విషయం చుట్టుపక్కల ఫ్లాట్ల వారికి తెలిసి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడ్డ మురళీధర్‌రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.కేసు నమోదు చేసిన పోలీసులు భార్యను విచారించగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిసింది. మురళీధర్‌రెడ్డి భార్యను అనుమానించి వేధించేవాడని, ఈక్రమంలోనే కడతేర్చిందని గుర్తించారు. మౌనికను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Hyderabad, Murder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు